న్యూజిలాండ్‌తో త్వరలో ప్రారంభం కాబోయే టీ20 సిరీస్(ind vs nz t20 series 2021)కు జట్టును ప్రకటించింది టీమ్ఇండియా సెలెక్షన్ కమిటీ. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ(rohit sharma news) కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ జట్టులో యువ ఆటగాడు సంజూ శాంసన్(sanju samson latest news)కు చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్‌కు వికెట్ కీపింగ్ ఆప్షన్లుగా ఎంచుకున్న పంత్, ఇషాన్ కిషన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. దీంతో శాంసన్‌కు చోటు ఇవ్వలేదు. ఇదే విషయంపై స్పందిస్తూ.. ఓ ట్వీట్ చేశాడు శాంసన్. సెలెక్టర్లపై మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
సంజూ శాంసన్(sanju samson latest news) వికెట్ కీపరే కాకుండా మంచి ఫీల్డర్ కూడా. ఎన్నో సందర్భాల్లో బౌండరీ దగ్గర అద్భుతమైన ఫీల్డింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోనే అతడు ట్వీట్ చేశాడు. తద్వారా తాను కీపర్ మాత్రమే కాదని.. మంచి ఫీల్డర్ కూడా అంటూ సెలెక్టర్ల నిర్ణయాన్ని పరోక్షంగా వ్యతిరేకించాడు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు.. శాంసన్(sanju samson news)ను దురదృష్టం వెంటాడుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
- — Sanju Samson (@IamSanjuSamson) November 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
— Sanju Samson (@IamSanjuSamson) November 10, 2021
">— Sanju Samson (@IamSanjuSamson) November 10, 2021
2015లో జింబాబ్వేతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ ద్వారా టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు శాంసన్(sanju samson latest news). మొత్తంగా 10 టీ20లు ఆడి 110.37 సగటుతో 117 పరుగులు సాధించాడు. అలాగే ఈ ఏడాది శ్రీలంకలో ఒక వన్డే ఆడి 46 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు.
కివీస్‌తో టీ20లకు భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.