Sanju Samson Century Celebration : తాజాగా జరిగిన సౌతాఫ్రికా సిరీస్ మూడో వన్డేలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగాడు. ఎంతో కాలం తర్వాత భారత జట్టు నుంచి పిలుపును అందుకున్న ఈ స్టార్ ప్లేయర్, తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 114 బంతుల్లో 108 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఆ తర్వాత 110 బంతుల్లో సెంచరీ సాధించాడు. అలా తనపై ట్రోల్స్ చేసిన వారికి తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు.
అయితే సెంచరీ మార్క్ అందుకున్నాక సంజూ శాంసన్ తనదైన స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. తన బైసెప్స్‌ను డగౌట్ వైపు చూపిస్తూ ధీమా వ్యక్తం చేశాడు. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
మరోవైపు సంజూ అభిమానులు తన కమ్‌బ్యాక్ చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎంతో కాలంగా దీనికోసం ఎదురుచూస్తున్నామని ఇప్పటికైనా తనకు ఈ అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
గత కొంత కాలంగా సంజూకు సరైన అవకాశాలు రావట్లేదు. ఒకటి రెండు మ్యాచ్‌లు తప్ప అతడు ఆడేందుకు పెద్దగా ఛాన్స్ దొరకలేదు. అయితే ఆ బాధలన్నింటినీ దిగమింగుకుని ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ అదరగొట్టాడు. తన ఇన్నింగ్స్‌లో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించి జట్టును ఆదుకున్నాడు.
-
Sanju Samson comes in clutch with a maiden international ton in the series decider 👌
— ICC (@ICC) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📝 #SAvIND: https://t.co/XDucAXYJtE pic.twitter.com/GTdM5wHkWE
">Sanju Samson comes in clutch with a maiden international ton in the series decider 👌
— ICC (@ICC) December 21, 2023
📝 #SAvIND: https://t.co/XDucAXYJtE pic.twitter.com/GTdM5wHkWESanju Samson comes in clutch with a maiden international ton in the series decider 👌
— ICC (@ICC) December 21, 2023
📝 #SAvIND: https://t.co/XDucAXYJtE pic.twitter.com/GTdM5wHkWE
India Vs South Africa 3rd ODI : ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు స్కోర్ చేసింది. ఇక సంజూతో పాటు తిలక్ వర్మ(52) కూడా ఈ మ్యాచ్‌లో రాణించాడు. యంగ్ సెన్సేషన్ రింకూ సింగ్ కూడా తన బ్యాట్‌కు పని చెప్పి 38 పరుగులతో దూకుడుగా ఆడాడు.
-
Sanju Samson gets a well deserved maiden century 👏🏻 as he plays extremely well helping India reach to a respectable total with Tilak Varma 🤝🏻 a great innings to watch,he really made ur count as he got his maiden 100 🔥#SAvIND | #SanjuSamson |#INDvSA
— ishaan (@ixxcric) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
pic.twitter.com/XNM5K72l65
">Sanju Samson gets a well deserved maiden century 👏🏻 as he plays extremely well helping India reach to a respectable total with Tilak Varma 🤝🏻 a great innings to watch,he really made ur count as he got his maiden 100 🔥#SAvIND | #SanjuSamson |#INDvSA
— ishaan (@ixxcric) December 21, 2023
pic.twitter.com/XNM5K72l65Sanju Samson gets a well deserved maiden century 👏🏻 as he plays extremely well helping India reach to a respectable total with Tilak Varma 🤝🏻 a great innings to watch,he really made ur count as he got his maiden 100 🔥#SAvIND | #SanjuSamson |#INDvSA
— ishaan (@ixxcric) December 21, 2023
pic.twitter.com/XNM5K72l65
మరోవైపు ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు రజత్ పాటిదార్ కూడా మెరుపు వేగంతో ఆడాడు.చివర్లో రింకూ సింగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో బ్యూరన్ హెండ్రిక్స్(3/63) మూడు వికెట్లు తీయగా, నండ్రె బర్గర్ రెండు వికెట్లు పడగొట్టాడు. లిజా విలియమ్స్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్ చెరో వికెట్ తీసారు.
-
Sanju Samson said, "I want to continue this form and win many matches for my country". pic.twitter.com/iJEV4Giy03
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sanju Samson said, "I want to continue this form and win many matches for my country". pic.twitter.com/iJEV4Giy03
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023Sanju Samson said, "I want to continue this form and win many matches for my country". pic.twitter.com/iJEV4Giy03
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023
శతక్కొట్టిన సంజూ - మూడో వన్డేలో భారత్ విజయం - సిరీస్ మనదేరా
చెన్నై కెప్టెన్సీని రిజెక్ట్ చేసిన సంజూ ? వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అశ్విన్