ఆసీస్ మాజీ క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్‌పై.. భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఉన్న సమయంలో చాలా వివాదాలు ఎదుర్కొన్నారు. ఇండియా క్రికెట్ చరిత్రలో వివాదస్పద కోచ్‌గా మిగిలిపోయిన ఛాపెల్.. ఓ సారి టెస్టు స్పెషలిస్ట్ వీవీఎస్ లక్ష్మణ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశాడటా! ఆ విషయాన్ని ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ వెల్లడించాడు.
"2005లో జింబాబ్వే పర్యటన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. గాయం కారణంగా వీవీఎస్ ఫీల్డ్‌ను వీడాడు. అతని స్థానంలో మైదానంలోకి దిగిన మరో ఆటగాడు స్లిప్స్‌లో ఓ క్యాచ్‌ను జారవిడిచాడు. దీంతో అక్కడ ఫీల్డింగ్ చేయాల్సిన లక్ష్మణ్ ఎందుకు లేడంటూ కోపానికి దిగాడు ఛాపెల్," అని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు మంజ్రేకర్.
ఇదీ చదవండి: క్రికెట్ ఆడుతున్న ఏనుగును ఎప్పుడైనా చూశారా?
"ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో కాఫీ తాగుతున్న వీవీఎస్‌ను.. ఫీల్డ్ నుంచి ఎందుకు వచ్చావంటూ ఛాపెల్ అడిగాడు. గాయం కారణంగా ఫీల్డ్‌ను వీడానని చెప్పినప్పటికీ.. అదేమైనా అంత ప్రాణాపాయమైన గాయమా? అని గ్రెగ్ అసహనం వ్యక్తం చేశాడు. అలాంటి సందర్భం వస్తే కానీ.. మైదానంలో నుంచి బయటకు రావద్దని చెప్పాడు. దీంతో లక్ష్మణ్ షాక్‌కు గురయ్యాడు," అంటూ నాటి సంఘటనను చెప్పాడు మంజ్రేకర్.
2005-07 మధ్య కాలంలో భారత జట్టు కోచ్‌గా పనిచేశాడు గ్రెగ్ ఛాపెల్. సౌరభ్ గంగూలీ- ఛాపెల్ మధ్య వివాదాలు ఎన్నో ఉన్నాయి.
ఇదీ చదవండి: 'మా ఇద్దరి మధ్య గొడవా? అదేం లేదే!'