ETV Bharat / sports

ఒకేరోజు ఇద్దరు మాజీ క్రికెటర్లు మృతి... ఇద్దరికీ బ్రెయిన్ ట్యూమరే - bangladesh cricketers death

ఒకేరోజు ఇద్దరు మాజీ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ బ్రెయిన్ ట్యూమర్​ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించి తుది శ్వాస విడిచారు.

Mosharraf Hossain pass away due to brain tumour

author img

By

Published : Apr 19, 2022, 7:13 PM IST

Samiur Rahman brain tumour: బంగ్లాదేశ్​కు చెందిన ఇద్దరు మాజీ క్రికెటర్లు ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్ తొలి వన్డే టీమ్​లో సభ్యుడైన సమియుర్ రెహ్మాన్(69).. ఢాకాలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ ట్యూమర్​తో పాటు డెమెంటియా అనే వ్యాధితో బాధపడుతున్న రెహ్మాన్.. నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే పరిస్థితి క్రమంగా దిగజారడం వల్ల.. మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. 1986లో ఆసియా కప్ టోర్నీలో పాల్గొన్నారు రెహ్మాన్. పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​కు బంగ్లా తరఫున ప్రాతినిధ్యం వహించారు. బౌలర్​గా ఆడిన రెండు అంతర్జాతీయ మ్యాచ్​ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత అంపైర్​గానూ సేవలు అందించారు.

Samiur Rahman pass away
సమియుర్ రెహ్మాన్

Mosharraf Hossain death: మరోవైపు, బంగ్లా మాజీ ఆటగాడు మొషరఫ్ హొస్సెన్(40) సైతం బ్రెయిన్ ట్యూమర్​తో మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్​ వ్యాధితో బాధపడుతున్నారు మొషరఫ్. సింగపూర్, భారత్ వంటి దేశాల్లోని ప్రముఖ ఆస్పత్రులలో చికిత్స తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆరోగ్యం క్షీణించి మరణించారు. ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన మొషరఫ్.. బంగ్లా తరఫున ఐదు అంతర్జాతీయ వన్డేలు ఆడారు. కాగా, దేశవాళీలో మొత్తం 572 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ జాతీయ స్థాయిలో అరుదైన రికార్డులు ఆయన పేరిట ఉన్నాయి.

Mosharraf Hossain pass away
మొషరఫ్ హొస్సెన్

ఇదీ చదవండి:

'కోహ్లీ స్లెడ్జింగ్ వేరే లెవెల్.. ఆరోజు భయంతో చచ్చిపోయా'

కొవిడ్ దెబ్బ.. దిల్లీ, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.