ETV Bharat / sports

బిడ్డకు జన్మనివ్వనున్న స్వలింగ జంట - జెస్ హెలియోక్

మూడేళ్ల క్రితం స్వలింగ వివాహంతో ఒక్కటైన ఆసీస్ క్రికెటర్ మేగాన్ స్కట్-జెస్ హోలియోక్ జంట.. తమ బంధానికి గుర్తుగా ఓ ఆడబిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ విషయాన్ని మేగాన్ ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది.

Megan Schutt, Jess Holyoake
మేగాన్ స్కట్, జెస్ హోలియోక్
author img

By

Published : May 30, 2021, 5:20 PM IST

Updated : May 30, 2021, 5:49 PM IST

స్వలింగ వివాహంతో సర్వత్రా చర్చనీయాంశమైన ఆసీస్ క్రికెటర్ మేగాన్ స్కట్​-జెస్ హోలియోక్​ జంట ఓ శుభవార్త చెప్పింది. 2019 మార్చి 31న వివాహ బంధంతో ఒక్కటైన ఈ స్వలింగ జోడీ.. తమ బంధానికి గుర్తుగా ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు వెల్లడించింది.

Same sex couple Megan Schutt and Jess Holyoake all set to welcome baby girl
మేగాన్ స్కట్-జెస్ హోలియోక్ జంట

"తన జీవిత భాగస్వామి జెస్​ గర్భవతి అనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపింది మేగాన్. జెస్​, నేను చాలా సంతోషంగా ఉన్నాం. జెస్​ త్వరలోనే పండంటి ఆడ బిడ్డకు జన్మనివ్వబోతోంది" అని పేర్కొంది.

  • Jess and I are excited to FINALLY be able to spill the beans 🙊👶🏼 Jess has the joy of carrying a mini me, lucky her 😌 baby girl already being smothered by the cat 🐈‍⬛ #weareintrouble pic.twitter.com/73lmJGX5wr

    — Megan Schutt (@megan_schutt) May 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతంలో వారిద్దరి వివాహం సందర్భంగా మేగాన్​.. "నా జీవితంలో ఇది అత్యుత్తమ రోజు. నా మనసు నిండుగా ఉంది. నేను చాలా అదృష్టవంతురాలిని" అని ట్వీట్​ చేసింది.

ఇలా ఒక్కటయ్యారు..

బ్రిస్బేన్​లోని జాతీయ క్రికెట్ కేంద్రంలో జెస్​ను తొలిసారి చూసినట్లు మేగాన్ స్కట్​ తెలిపింది. తనతో సరదాగా గడిపినట్లు పేర్కొంది. తర్వాత తన ఫోన్​ నంబర్​కు ఓ సందేశం పంపిందని వెల్లడించింది.

"ఎంతో ఇష్టం ఉంటే కానీ, వేరే వ్యక్తుల నంబర్ తీసుకోరు కదా. నేను ఇష్టపడ్డ అమ్మాయి నుంచి మెసేజ్ రావడం వల్ల నేను చాలా సంతోషపడ్డాను" అని తమ ప్రేమ ప్రయాణం గురించి తెలిపింది మేగాన్ స్కట్. దీర్ఘ కాలం వేచి చూసి.. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాక.. తాము పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: IPL 2021: ఆ మ్యాచ్​లకు కమిన్స్​ దూరం!

Last Updated : May 30, 2021, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.