టీ20 ప్రపంచకప్ (T20 World Cup) నుంచి వైదొలిగాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ (Sam Curran). ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఐపీఎల్లో చెన్నై తరఫున మ్యాచ్‌లో వెన్ను గాయం (Sam Curran Injury) కారణంగా అతడు తప్పుకున్నట్లు ఈసీబీ వెల్లడించింది.
మరికొన్ని రోజుల్లో సామ్.. ఇంగ్లాండ్ తిరిగి వెళ్లనున్నాడని, అక్కడ తదుపరి స్కానింగ్‌లు తీయడం సహా వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నాడని ఈసీబీ తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అర్ధాంతరంగా ఐపీఎల్‌ను (Sam Curran IPL) వీడటంపై విచారం వ్యక్తంచేశాడు కరన్. "దురదృష్టవశాత్తు ఐపీఎల్ సహా ప్రపంచకప్‌ను మిస్ అవుతున్నా. మంచి సమయంలో చెన్నై జట్టును వీడటం బాధగా ఉంది. చెన్నై ఫ్యాన్స్ మద్దతు మరవలేనిది. త్వరలోనే కలుస్తా." అని కరన్ చెప్పాడు.
ఇదీ చూడండి: 'పాక్‌తో భారత్ పోటీపడలేదు.. అందుకే మాతో ఆడట్లేదు'