ETV Bharat / sports

క్రికెట్​ ఫ్యాన్స్​కు శుభవార్త​.. అమ్మకానికి టీ20 ప్రపంచకప్​ టికెట్లు

T20 World Cup Tickets: క్రికెట్​ ప్రేమికులకు శుభవార్త చెప్పింది ఐసీసీ. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్​ టికెట్లు విక్రయానికి ఉంచినట్లు తెలిపింది.

T20 World Cup Tickets
టీ20 ప్రపంచకప్​ టికెట్లు
author img

By

Published : Feb 7, 2022, 12:38 PM IST

T20 World Cup Tickets: టీ20 ప్రపంచకప్​నకు రంగం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ మెగా ఈవెంట్​​ టికెట్లు అమ్మకానికి ఉంచినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తెలిపింది. ఈ టికెట్​ ధరలను పిల్లలకు 5 డాలర్లు(రూ.374), పెద్దలకు 20 డాలర్లుగా (దాదాపు రూ.1495) నిర్ణయించినట్లు పేర్కొంది. t20worldcup.com వైబ్​సైట్​లో సోమవారం నుంచి టికెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.

45 మ్యాచ్​లు..

ఈ మెగా టోర్నీ అక్టోబర్​ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో జరగనుంది. ఏడు మైదానాల్లో మొత్తంగా 45 మ్యాచ్​లు జరగనున్నాయి. అడిలైడ్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబర్ట్, మెల్​బోర్న్, పెర్త్, సిడ్నీ మైదానాలు పొట్టి ప్రపంచకప్​ వేదికలు కానున్నాయి. ఫైనల్​, నవంబర్ 13న మెల్​బోర్న్​ క్రికెట్ మైదానంలో జరగనుంది. సెమీఫైనల్స్ సిడ్నీ, అడిలైడ్, ఓవల్ వేదికగా నవంబర్ 9, 10న నిర్వహించనున్నారు. టీ 20 ప్రపంచకప్​నకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.

సూపర్​ 12..

అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు సూపర్​ 12లో ఉన్నాయి. నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ క్వాలిఫయర్స్​ ఆడనున్నాయి.

ఇదీ చూడండి: యువ క్రికెటర్​పై రోహిత్ కోపం.. ఏమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.