ETV Bharat / sports

సచిన్ చేతుల మీదుగా అండర్-19 వరల్డ్‌కప్ విజేతలకు సన్మానం

అండర్ - 19 మహిళల ప్రపంచకప్​ ట్రోఫీని ముద్దాడిన టీమ్​ఇండియా అమ్మాయిలను సత్కరించేందుకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం నిర్వహించనుంది. ఈ వేడుకకు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్​ చీఫ్​ గెస్ట్​గా రానున్నారు.

Under 19 World cup
సచిన్ చేతుల మీదుగా అండర్-19 వరల్డ్‌కప్ విజేతలకు సన్మానం
author img

By

Published : Jan 31, 2023, 12:20 PM IST

తొలిసారి నిర్వహించిన అండర్ - 19 మహిళల ప్రపంచకప్​ ఫైనల్​లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి టైటిల్‌ను ముద్దాడిన టీమ్‌ఇండియా. దీంతో యువ ప్లేయర్లను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక జట్టులోని సభ్యులు, సహాయక సిబ్బందికి రూ. 5 కోట్ల భారీ నజరానాను బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో భారత క్రీడాకారిణులను ప్రత్యేకంగా సత్కరించేందుకు బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది.

భారత్‌ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ బుధవారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. మ్యాచ్‌కు ముందు అండర్ - 19 మహిళల ప్రపంచకప్‌ విజేతలను సత్కరిస్తామని బీసీసీఐ వెల్లడించింది. దిగ్గజ క్రికెటర్​ సచిన్‌ తెందుల్కర్ చేతుల మీదగా వారిని సత్కరించనుంది. కాగా, నేడు దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి భారత మహిళల అండర్ -19 జట్టు చేరుకొంటుంది. "అండర్ -19 మహిళల ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత్‌ జట్టు సభ్యులకు సచిన్‌ తెందూల్కర్, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్స్‌ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం నిర్వహించబోతున్నందుకు సంతోషంగా ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 1 సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది" అని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

ఇదీచూడండి: ప్రధాని మోదీ గురువు ఆశ్రమానికి కోహ్లీ-అనుష్క!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.