ETV Bharat / sports

Sachin: ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను - sachin tendulkar

శనివారం ప్రపంచ దినోత్సవం రోజు సందర్భంగా భారత క్రికెట్​ దిగ్గజం సచిన్‌ తెందల్కర్‌.. ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా తన వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు నాటి మొక్కలు పెంచిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

Sachin
సచిన్‌ తెందల్కర్‌
author img

By

Published : Jun 5, 2021, 7:10 PM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు(World Environment Day) క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందల్కర్‌(Sachin Tendulkar) తన అభిమానులకు మంచి సందేశం ఇచ్చాడు. చెట్లను నాటి ఈ ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చాడు. కాలుష్యంతో ప్రమాదకరంగా మారుతున్న ఈ నేలతల్లిని తమవంతుగా బాగుచేయాలని కోరాడు. ఈ క్రమంలోనే అతడు కూడా తన వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు నాటి మొక్కలను పెంచాడు. అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు.

"ఈ విత్తనాలు మొక్కలుగా పెరగడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది నమ్మశక్యం కానిది. దీనివల్ల చాలా ఆనందం పొందాను. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను" అని పేర్కొన్నాడు. "మనల్ని సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ప్రకృతి నిరంతరాయంగా పనిచేస్తుంది" అని వ్యాఖ్య . సచిన్‌తో పాటు పలు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు సైతం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పోస్టులు చేశాయి. కాలుష్య కారకాల నుంచి ఈ భూమాతను కాపాడాలని వారంతా అభిమానులను కోరారు.

ఇదీ చూడండి Sachin: భారత్ కంటే ముందు సచిన్, పాక్ జట్టులో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.