ETV Bharat / sports

'మన టాలెంట్​ను చూపించడానికి ఇదే బెస్ట్​ ఛాన్స్​'.. అమ్మాయిలకు సచిన్​ సలహా! - సచిన్​ తెందుల్కర్ ఐసీసీ కాలమ్​

భారత మహిళల జట్టు ఎప్పటికీ అత్యుత్తమ జట్టుగా ఎదగాలని స్టార్​ క్రికెట్​ ప్లేయర్​ సచిన్ తెందుల్కర్ అభిప్రాయపడ్డారు. శనివారం దక్షిణాఫ్రికాలో జరగనున్న మహిళల క్రికెట్​ ప్రపంచ కప్‌ అండర్​-19 ఈవెంట్​ జరగనున్న సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

ICC Under19 Womens T20 World Cup
sachin tendulkar
author img

By

Published : Jan 13, 2023, 2:09 PM IST

ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు అత్యుత్తమ జట్టుగా ఎదగాలని క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందుల్కర్ అభిప్రాయపడ్డాడు. శనివారం దక్షిణాఫ్రికాలో జరగనున్న ఐసీసీ మహిళా ప్రపంచ కప్​ ఈవెంట్​లో పాల్గొనే 15 మంది అండర్​ 19 క్రీడాకారిణులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఈ టీమ్​లో సీనియర్​ ప్లేయర్స్ షఫాలి వర్మతో పాటు రిచా ఘోష్​లు ఉన్నారు.

"మహిళల జట్టు ఈసారి అత్యుత్తమ జట్టుగా ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉందని నేను విశ్వసిస్తాను"..బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ సత్తా ఉన్న అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులు సైతం జట్టులో ఉన్నందున టీమ్​ మరింత బలపడింది " అని సచిన్ ఐసీసీకు చెందిన ఓ కాలమ్​లో​ పేర్కొన్నారు. "మహిళల క్రికెట్ భారీ పురోగతి సాధించినప్పటికీ, ఇంకా మెరుగుపడాల్సిన అంశాలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మరింత పటిష్టమైన బీజం పడాల్సిన అవసరం ఎంతో ఉంది . మనం ఎంత పెద్దగా పునాదిని విస్తరింపజేస్తామో, అంత ఎక్కువ ప్రతిభను వెలికితీయగలం. ఇది గేమ్ నాణ్యతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది" అని అన్నారు.

"మొదటి టోర్నమెంట్​లోనే ​అది జరుగుతుందని నేను భావిస్తున్నాను. మన దగ్గరున్న అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇదే సరైన అవకాశం. దీని వల్ల వివిధ దేశాలు జూనియర్ క్రికెట్​ టీమ్​పై మరింత ఆసక్తి కనబరుస్తారు. ఫలితంగా భవిష్యత్తులో అండర్​19 ప్రపంచ కప్‌లు అలాగే సీనియర్ క్రికెట్‌లకు స్థిరమైన ఫీడర్ లైన్ ఉంటుంది" అని సచిన్​ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.