ETV Bharat / sports

'పాక్​తో మ్యాచ్​.. ఆ సిక్స్​ నాకెంతో ప్రత్యేకం.. రాత్రంతా అస్సలు నిద్రపోలేదు'

పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​ను గుర్తుచేసుకున్నాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​. ఆ రోజు రాత్రంతా అస్సలు నిద్రపోలేదని చెప్పాడు. అలాగే ఆ మ్యాచ్​లో తాను బాదిన ఓ సిక్స్​.. తన కెరీర్​లోనే ఎంతో ప్రత్యేకమని తెలిపాడు.

sachin 2003 worldcup
సచిన్ 2003 వరల్డ్ కప్​
author img

By

Published : Mar 17, 2023, 7:17 PM IST

టీమ్​ఇండియా పాకిస్థాన్​ మధ్య మ్యాచ్​ అంటేనే అభిమానుల్లో ఎంతటి ఉత్కంఠ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతుంటారు. అదే సమయంలో మ్యాచ్​లో ఆడే ప్లేయర్లు కూడా అంతే. వారు కూడా తమ శ్రమను మించి అడుతుంటారు. ప్రతి ప్లేయర్​పై తీవ్ర ఒత్తిడి కూడా ఉంటుంది. అయితే దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందూల్కర్‌ కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడట. తాజాగా ఇదే విషయంపై ఓ కార్యక్రమంలో మాట్లాడాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముందు తనకు నిద్ర కరవైందని మాస్టర్​ గుర్తు చేసుకున్నాడు.

"భారత్ - పాకిస్థాన్‌ టీమ్​ మధ్య మ్యాచ్‌ అంటేనే వరల్డ్​వైడ్​గా ప్రతిఒక్క క్రికెట్​ అభిమానికి ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇతర మ్యాచుల్లో గెలిచినా గెలవకపోయినా.. పాకిస్థాన్​పై మాత్రం టీమ్‌ఇండియా గెలవాలని అభిమానులు ఎంతో బలంగా కోరుకుంటుంటారు. అలాంటప్పుడు ఇలాంటి మ్యాచ్‌పై అంచనాలు, ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే 2003 వన్డే ప్రపంచకప్​ మ్యాచ్‌కు ముందు నేను నిద్రపోలేదు. ఇక షోయబ్‌ బౌలింగ్‌లో బాదిన సిక్స్‌ నా కెరీర్​లో ఎంతో ప్రత్యేకమైన షాట్. అయితే, ఇలాంటి షాట్‌ కొట్టాలని ముందగానే ప్లాన్ చేసుకోలేదు. సాధారణంగానే బరిలోకి దిగాను. బంతి గమనాన్ని అంచనా వేస్తూ.. అప్పటికప్పుడు అలాంటి షాట్​ను కొట్టేయాలి. ఆ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. బంతి ఆఫ్‌సైడ్‌కు ఆవల వెళ్తున్నట్లు నాకు అనిపించింది. అంతే వెంటనే షాట్‌ బాదేందుకు ప్రయత్నించా. అది కాస్త సిక్స్‌ర్​గా దూసుకెళ్లింది" అని సచిన్‌ పేర్కొన్నాడు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో సచిన్‌ 98 పరుగులు చేసి కాస్తలో సెంచరీ మిస్​ చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్​ పాకిస్థాన్​పై విజయం సాధించడంలో ఎంతో కీలకంగా మారింది.

నంబర్‌వన్‌గా టెస్టు క్రికెట్‌.. ఇకపోతే గతకొంతకాలంగా టెస్టు క్రికెట్‌లోనూ దూకుడు పెరిగిన విషయం తెలిసిందే. ఈ లాంగ్​ ఫార్మాట్‌పై క్రికెట్​ అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే టెస్టు ఫార్మాట్‌ నంబర్‌వన్‌గా కొనసాగాలంటే ఎలాంటి ప్లాన్స్​ రూపొందించాలనే విషయంపై సచిన్‌ మాట్లాడాడు. "ఇప్పుడు మనమంతా తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే. టెస్టు క్రికెట్‌పై ఇంట్రెస్ట్​గా ఉండాలి కానీ.. ఎన్ని రోజుల్లో పూర్తవుతుందనే విషయం గురించి అస్సలు చర్చించకూడదు. టెస్టు క్రికెట్‌ మరింత ఆసక్తిగా, ఉత్కంఠగా మారాలంటే వేర్వేరు పిచ్‌ పరిస్థితులపై ఆడుతూ ఉండాలి. పేస్‌ బౌలింగ్, స్వింగ్‌, స్పిన్.. ఇలా అన్ని రకాలు బంతులను ఎదుర్కొంటూ ఉండాలి. అప్పుడే టెస్టు క్రికెట్‌పై ప్లేయర్స్​, ఫ్యాన్స్​లో బాగా ఆసక్తి పెరుగుతుంది. ఇక టీ20, వన్డే ఫార్మాట్లు బ్యాటర్లకు అనుకూలంగానే ఉంటుంది. టీ20ల్లో ప్రతి బంతినీ కొట్టేందుకు ప్రయత్నిస్టుంటారు. అలానే ఇప్పుడున్న రూల్స్​ ప్రకారం వన్డేల్లోనూ 320 రన్స్​ అంటే సాధారణ స్కోరుగా మారిపోయింది" అని సచిన్‌ వివరించాడు.

ఇదీ చూడండి: మిచెల్​ స్టార్క్​ అరుదైన ఫీట్​.. 'నాటు నాటు' సాంగ్​కు కోహ్లీ స్టెప్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.