ETV Bharat / sports

21వ శతాబ్దపు టెస్టు ఫార్మాట్ టాపర్స్​ సచిన్, మురళీధరన్ - ముత్తయ్య మురళీధరన్ అత్యుత్తమ టెస్టు క్రికెటర్

స్టార్ స్పోర్ట్స్​ 21వ శతాబ్దపు అత్యుత్తమ బ్యాట్స్​మెన్ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నాడు సచిన్ తెందూల్కర్. అలాగే అత్యుత్తమ బౌలర్ల జాబితాలో టాప్​లో నిలిచాడు ముత్తయ్య మురళీధరన్.

sachin
సచిన్
author img

By

Published : Jun 22, 2021, 10:35 AM IST

క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్​ మరో ఘనత సాధించాడు. ప్రముఖ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఎంపిక చేసిన గ్రేటెస్ట్ బ్యాట్స్​మెన్ ఆఫ్ ఆల్ టైమ్ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇతడితో పాటు జాక్వెస్ కలిస్, స్టీవ్ స్మిత్, రికీ పాంటింగ్ ఇందులో చోటు కైవసం చేసుకున్నారు.

  • టెస్టుల్లో సచిన్ మొత్తంగా 15,921 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు ఉన్నాయి. రన్స్​తో పాటు శతకాల పరంగా సచిన్​ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. పరుగుల విషయంలో అతనికి చేరువలో ఆసీస్​ మాజీ కెప్టెన్​ రికీ పాంటింగ్ దగ్గర్లో ఉన్నాడు. తెందూల్కర్​ కంటే 2,543 పరుగులు తక్కువగా నమోదు చేశాడు. ఇక సెంచరీల విషయానికొస్తే దక్షిణాఫ్రికా మాజీ ఆల్​రౌండర్​ జాక్వెస్​ కలిస్​.. సచిన్​కు చేరువలో ఉన్నాడు. అతడు టెస్టుల్లో 45 శతకాలు బాదాడు.

ఇక అత్యుత్తమ బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్​ను అగ్రస్థానం వరించింది. ఇతడితో పాటు షేన్ వార్న్, డెయిల్ స్టెయిన్, మెక్​గ్రాత్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

  • మురళీధరన్ తన టెస్టు కెరీర్​లో 800 వికెట్లు సాధించి ఈ ఫార్మాట్​లో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్​గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. షేన్ వార్న్ 708 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

జ్యూరీ సభ్యులు వీరే

అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు స్టార్ స్పోర్ట్స్ నియమించిన జ్యూరీలో 50 మంది సభ్యులు ఉన్నారు. సునీల్ గావస్కర్, ఇయాన్ బిషప్, హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్, స్కాట్ స్టైరిస్, గౌతమ్ గంభీర్​తో పాటు పలువురు ఇందులో ఉన్నారు. ఇందుకోసం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ట్విట్టర్​లో ఓ పోల్ కూడా నిర్వహించింది. జూన్ 15 నుంచి 17 వరకు జరిగిన ఈ పోల్​లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఫ్యాన్స్.

ఇవీ చూడండి: WTC Final: ఐసీసీకి గావస్కర్ అద్భుత సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.