టీమ్‌ఇండియా మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్(Mithali Raj).. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్(Sachin Tendulkar) తర్వాత సుదీర్ఘకాలం ఆడిన రెండో క్రికెటర్‌గా(22ఏళ్లు) ఇటీవల రికార్డు సృష్టించింది. మాస్టర్ 23 ఏళ్ల టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో పాటే అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధికంగా(10,337) పరుగులు చేసిన ప్లేయర్స్‌గా మహిళా క్రికెట్లో మిథాలీ, పురుషుల క్రికెట్లో సచిన్ ఉన్నారు.
ఈ రెండే కాకుండా సచిన్-మిథాలీ కెరీర్లో మరో విషయంలోనూ సారుప్యత ఉంది. అదేంటంటే ఈ స్టార్ క్రికెటర్లు ఇద్దరూ తమ అంతర్జాతీయ కెరీర్‌ను ఒకే వయసులో ప్రారంభించడం విశేషం. 16ఏళ్ల 205 రోజులు అప్పుడే వీరిద్దరూ తమ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. మాస్టర్ టెస్టుల్లో అరంగేట్రం చేయగా.. మిథాలీ వన్డే కెరీర్ ప్రారంభించింది.
ప్రస్తుతం మిథాలీ రాజ్ సుదీర్ఘ ఫార్మాట్, వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతోంది. టీ20లకు గుడ్‌బై చెప్పేసింది. వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచి వీడ్కోలు పలకాలని ఆమె భావిస్తోంది. అప్పటి వరకు ఆమె వన్డేల్లో కొనసాగితే సచిన్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ఆమె సారథ్యంలో టీమ్‌ఇండియా ఇప్పటి వరకు రెండుసార్లు ఫైనల్‌కు చేరుకుంది. సచిన్.. కెరీర్లో 200టెస్టులు(15,921 పరుగులు), 463వన్డేలు(18,426), ఒక్క టీ20(10), 78ఐపీఎల్ మ్యాచ్‌లు(2,334) ఆడాడు.
ఇదీ చూడండి: