ఆకాశం మేఘావృతమైతే ఇంగ్లాండ్‌లో పిచ్ పరిస్థితులు వేగంగా మారిపోతాయని టీమ్‌ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్(Sachin Tendulkar) అన్నాడు. ఈ పరిస్థితులు స్పిన్నర్లకు సహకరిస్తాయని తెలిపాడు.
"ఇంగ్లాండ్‌లో మేఘావృతమైతే పరిస్థితులు వేగంగా మారిపోతాయి. పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించడం అసాధారణమేమీ కాదు. అవసరమైతే అశ్విన్, జడేజాలు బ్యాటింగ్ చేయగలరు. కొన్నిసార్లు ఆకాశం మేఘావృతమై గాలి బాగా వీస్తుంది. అలాంటి పరిస్థితులు స్పిన్నర్లకూ ఉపయోగపడతాయి. ఆఫ్ నుంచి లెగ్‌కు గాలి వీస్తుంటే కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు ఎడమచేతి వాటం స్పిన్నర్‌తో బౌలింగ్ చేయిస్తే ఎల్బీడబ్ల్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. గాలి దిశకు అనుగుణంగా స్వింగ్ బౌలర్లను బరిలో దించొచ్చు. కొన్నిసార్లు గాలి సహాయంతో బోల్తాకొట్టించాలి. ప్రతిసారి బంతి బ్యాటు అంచును తాకి షార్ట్‌లెగ్‌లో క్యాచ్ రాదు. గాల్లోనే బంతిని తిప్పితే కీపర్‌కో, స్లిప్‌లోనూ క్యాచ్ ఇచ్చి బ్యాట్స్‌మెన్ ఔటవుతారు"’ అని సచిన్ వివరించాడు.