ETV Bharat / sports

ఉమ్రాన్​ @154 కి.మీ.. సచిన్​ రికార్డును సమం చేసిన రుతురాజ్​ - ఐపీఎల్​ 2022 ఉమ్రాన్​ మాలిక్​

IPL 2022 CSK VS SRH: ఆదివారం సన్​రైజర్స్​ హైదరాబాద్​-చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో తెలుసుకుందాం..

ruturaj gaikwad umran malik
రుతురాజ్ గైక్వాడ్​ ఉమ్రాన్ మాలిక్​
author img

By

Published : May 2, 2022, 9:51 AM IST

Umran Malik bowling 154km speed: ఈ ఐపీఎల్​ సీజన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ పేసర్​ ఉమ్రాన్​ మాలిక్ తన ఫాస్ట్​ బౌలింగ్​తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. దాదాపు 150కిలోమీటర్ల వేగంతో బంతులను సంధిస్తూ బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. అయితే ఇప్పుడతడు మరో రికార్డును అధిగమించాడు. ఆదివారం చెన్నై సూపర్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో రెండు బంతులను ఏకంగా 154 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. దీంతో ఈ సీజన్​లో ఇప్పటివరకు అత్యంత ఎక్కువ వేగంగా బంతిని వేసిన తొలి బౌలర్​గా రికార్డుకెక్కాడు. గుజరాత్​ టైటాన్స్ పేసర్​ ఫెర్గూసన్​(153 కి.మీ వేగం) పేరిట ఉన్న రికార్డును మాలిక్​ బద్దలు కొట్టాడు. కాగా, ఈ ఏడాది టాప్​ 5 ఫాస్టెస్ట్​ డెలివరీల్లో నాలుగు ఉమ్రాన్​ పేరిటే ఉండటం విశేషం. ఇక ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన ఉమ్రాన్​ 7 మ్యాచుల్లో ఫాస్టెస్ట్​ డెలివరీ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్​లో ఎస్ఆర్​హెచ్​పై సీఎస్కే 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Ruturaj gaikwad Sachin record: సన్​రైజర్స్​తో జరిగిన ఈ మ్యాచ్​తో మాళ్లీ ఫామ్​లోకి వచ్చాడు చెన్నై ఓపెనర్ రుతురాజ్​ గైక్వాడ్. 57 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 99 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్​ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్​లో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్​లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్​గా దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​ రికార్డును సమం చేశాడు. మాస్టర్​ 31 ఇన్నింగ్స్​లలో వెయ్యి రన్స్​ మార్క్​ను చేరుకోగా.. రుతురాజ్​ కూడా 31 ఇన్నింగ్స్​లోనే వెయ్యి పరుగులు చేశాడు. కాగా, గత సీజన్​లో 16 మ్యాచ్​ల్లో 635 పరుగులు చేసి ఆరెంజ్​ క్యాప్​ సొంతం చేసుకున్న అతడు ఈ సీజన్​లో ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడి 237 రన్స్​ మాత్రమే చేశాడు.

ఇదీ చూడండి: జడ్డూకు దాని గురించి ముందే తెలుసు.. అయినా..: ధోనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.