ETV Bharat / sports

IND VS ENG: ఐదో టెస్టుకు రోహిత్ ఔట్​.. కెప్టెన్​ ఎవరంటే?

England test Bumrah Captain: కరోనా బారిన పడి ఇంకా కోలుకోని రోహిత్​ శర్మ.. ఇంగ్లాండ్​తో జరగనున్న ఐదో(రీషెడ్యూల్​) టెస్టుకు దూరం కానున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. తాత్కాలిక కెప్టెన్​గా బుమ్రా వ్యవహరించనున్నాడని అన్నారు.

England test Bumrah Captain
ఇంగ్లాండ్​ ఐదో టెస్టుకు రోహిత్ దూరం
author img

By

Published : Jun 29, 2022, 6:57 PM IST

England test Bumrah Captain: ఇంగ్లాండ్​ పర్యనటకు వెళ్లిన కెప్టెన్ రోహిత్​ శర్మకు కరోనా పాజిటివ్​గా తేలిన సంగతి తెలిసిందే. అయితే అతడు త్వరగా కోలుకుంటే.. జులై 1వ తేదీ నుంచి జరగనున్న రీషెడ్యూల్​ టెస్టుకు ఆడే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడా అవకాశం లేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. బుధవారం చేసిన రెండో టెస్టులోనూ హిట్​మ్యాన్​కు పాజిటివ్​గా వచ్చినట్లు చెప్పారు. అతడు మ్యాచ్​కు దూరం అవుతాడని స్పష్టం చేశారు. వైస్ కెప్టెన్ బుమ్రాను.. తాత్కాలిక సారథిగా నియమించనున్నట్లు తెలిపారు. దీంతో 35ఏళ్ల తర్వాత జట్టుకు సారథ్యం వహించనున్న తొలి ఫాస్ట్​ బౌలర్​గా బుమ్రా నిలిచాడు. 1987లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న దిగ్గజ క్రికెటర్​ కపిల్​దేవ్.. చివరిసారిగా ఫాస్ట్​బౌలర్​గా టీమ్​ఇండియాకు సారథ్యం వహించాడు. "ఐదో టెస్టుకు రోహిత్​ దూరం కానున్నాడు. అతడికి మళ్లీ పాజిటివ్​గా తేలింది. ఇంకా ఐసోలేషన్​లోనే ఉన్నాడు. కేఎల్​ రాహుల్​ కూడా లేని కారణంగా వైస్​ కెప్టెన్​ అయిన బుమ్రా.. తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తాడు" అని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ మ్యాచ్​లో రోహిత్​ లేని కారణంగా శుభమన్​ గిల్​తో పాటు పుజారా లేదా హనుమ ఓపెనింగ్​ చేసే అవకాశముందని వెల్లడించారు. కాగా, ఇటీవలే రోహిత్​ స్థానంలో మరో ప్లేయర్​కు అవకాశమిచ్చింది బీసీసీఐ. మయాంక్​ అగర్వాల్​ను టీమ్​లోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. అయితే ఇతడు తుది జట్టులో ఆడటంపై స్పష్టత లేదని అన్నారు అధికారి.

గతేడాది పూర్తికావాల్సిన 5 టెస్టుల సిరీస్‌.. నాలుగు మ్యాచ్‌లు ఆడాక కరోనా కేసుల కారణంగానే వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ అదే టెస్టుకు ముందు పలువురు భారత ఆటగాళ్లు కొవిడ్‌-19 బారిన పడటం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. హిట్​మ్యాన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

ఇదీ చూడండి: ఐపీఎల్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. ఇకపై మరింత మజా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.