Rohit Sharma World Cup : 2023 వరల్డ్‌కప్ తొలి సెమీఫైనల్లో భారత్ - న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు ముంబయి వాంఖడే స్టేడియం వేదికైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు అదిరే ఆరంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (47 పరుగులు : 29 బంతుల్లో, 4x4, 4x6), బౌండరీలతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ, 8.2 ఓవర్ల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్.. క్యాచౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో రోహిత్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అవేంటంటే?
- ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 4 సిక్స్‌లు కొట్టాడు. దీంతో ఈ టోర్నీలో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా రోహిత్ (28*) టాప్‌లో నిలిచాడు.
- సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్ (28) రోహిత్ శర్మ. ఇదివరకు ఈ రికార్డు వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ (26) పేరిట ఉండేది. గేల్ 2015 ప్రపంచకప్ ఎడిషన్‌లో 26 సిక్స్‌లు బాదాడు. కాగా, రోహిత్ ప్రస్తుతం ఈ రికార్డు బ్రేక్ చేశాడు.
- ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్ రోహిత్. అతడు (2015, 2019, 2023) మూడు వరల్డ్‌కప్ ఎడిషన్లలో 50 సిక్స్‌లు బాది.. క్రిస్ గేల్ (49)ను దాటేశాడు.
రోహిత్ ఔటైన తర్వాత మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (79*), విరాట్ కోహ్లీ (42*) స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఇన్నింగ్స్ 22.4 వద్ద బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. రిటైర్డ్ హర్ట్‌గా క్రీజును వీడాడు. ముంబయిలో వేడి తీవ్రతను తట్టుకోని గిల్.. స్వల్పంగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఫిజియో సూచన మేరకు గిల్.. మైదానం వీడాడు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు దిగాడు.
-
🚨 Milestone Alert 🚨
— BCCI (@BCCI) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Captain Rohit Sharma has now hit the most sixes in Men's ODI World Cup 🫡#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/rapyuF0Ueg
">🚨 Milestone Alert 🚨
— BCCI (@BCCI) November 15, 2023
Captain Rohit Sharma has now hit the most sixes in Men's ODI World Cup 🫡#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/rapyuF0Ueg🚨 Milestone Alert 🚨
— BCCI (@BCCI) November 15, 2023
Captain Rohit Sharma has now hit the most sixes in Men's ODI World Cup 🫡#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/rapyuF0Ueg
వాంఖడేలో వెంకటేశ్ సందడి.. వాంఖడేలో వెంకటేశ్ సందడి.. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్‌కు క్రెకెట్పై ఉన్న ప్రేమ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీమ్ఇండియా మ్యాచ్‌లకు అప్పుడప్పుడు ఆయన స్టేడియంలో దర్శనమిస్తుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం జరుగుతున్న తొలి సెమీస్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయన ముంబయి వాంఖడే స్టేడియానికి వచ్చారు. అక్కడు క్రికెట్ దిగ్గజన విండీస్ మాజీ ఆటగాడు వివ్ రిచర్డ్స్‌ను కలిశారు.
ఛేజింగ్‌లో పొంచి ఉన్న పెనుగండం.. వాంఖడే పిచ్‌పై ఆ 15 ఓవర్లు ప్రమాదకరం..
8వ సెమీస్‌కు భారత్ రె'ఢీ' - ఆ నాలుగు సార్లు ఏం జరిగిందంటే?