Rohit Sharma World Cup : 2023 ప్రపంచకప్‌లో భారత్ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్, అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. అయితే తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపర్చిన కెప్టెన్ రోహిత్ శర్మను పలు అరుదైన ఘనతలు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ ఈ రికార్డులు అధిగమించాలని అతడి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఆ రికార్డులేంటంటే
రోహిత్ సిక్సర్ల ఘనత..
Rohit Sharma International Sixes : హిట్‌మ్యాన్ రోహిత్.. ఇప్పటివరకూ 452 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 551 సిక్సర్లు సంధించాడు. మరో మూడు సిక్స్‌లు బాదితే.. అత్యధిక సిక్సర్ల జాబితాలో 554తో టాప్‌లోకి దూసుకెళ్తాడు. ఈ లిస్ట్‌లో ప్రస్తుతం వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 553 సిక్స్‌లతో ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో (రిటైర్ కానివారు) ఇంగ్లాండ్ బ్యాట్లర్ (315 సిక్స్‌లు).. టాప్ 10లో చివరి ప్లేస్‌లో ఉన్నాడు. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (283) 11 వ స్థానంలో కొనసాగుతున్నాడు.
అంతర్జాతీయంగా అత్యధిత సిక్స్‌లు బాదిన టాప్ 5 బ్యాటర్లు..
- క్రిస్ గేల్ - వెస్టిండీస్ 553 సిక్సర్లు
- రోహిత్ శర్మ - భారత్ 551 సిక్సర్లు
- షాహిద్ అఫ్రిదీ - పాకిస్థాన్ 476 సిక్సర్లు
- బ్రెండన్ మెకల్లమ్ - న్యూజిలాండ్ 389 సిక్సర్లు
- మార్టిన్ గప్టిల్ - న్యూజిలాండ్ 383 సిక్సర్లు
రోహిత్ @1000..
రోహిత్ తన కెరీర్లో ప్రస్తుతం మూడో వన్డే ప్రపంచకప్ ఆడుతున్నాడు. ఈ మూడు ఎడిషన్లలో రోహిత్ 18 మ్యాచ్‌ల్లో కలిపి 978 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. 2015లో ఒక సెంచరీ బాదగా.. 2019లో ఏకంగా 5 శతకాలు నమోదు చేశాడు. ఇక ప్రపంచకప్‌లో వెయ్యి పరుగులు మైలురాయి అందుకోవాలంటే ప్రస్తుతం రోహిత్‌కు 22 పరుగులు కావాలి. ఈ క్రమంలో మెగాటోర్నీలో 1000 పరుగులు దాటిన నాలుగో భారత బ్యాటర్‌గా రోహిత్ నిలుస్తాడు.
టాప్ 5 భారత బ్యాటర్లు
- సచిన్ తెందూల్కర్ 2278 పరుగులు 45 మ్యాచ్‌లు
- విరాట్ కోహ్లీ 1115 పరుగులు 27 మ్యాచ్‌లు
- సౌరభ్ గంగూలీ 1006 పరుగులు 21 మ్యాచ్‌లు
- రోహిత్ శర్మ 978 పరుగులు 18 మ్యాచ్‌లు
- రాహుల్ ద్రవిడ్ 860 పరుగులు 22 మ్యాచ్‌లు
-
India entertains Afghanistan in Delhi 🏏
— ICC (@ICC) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Can the hosts make it two wins in two? 🤔#CWC23 | #INDvAFG pic.twitter.com/qVwa32tWuG
">India entertains Afghanistan in Delhi 🏏
— ICC (@ICC) October 11, 2023
Can the hosts make it two wins in two? 🤔#CWC23 | #INDvAFG pic.twitter.com/qVwa32tWuGIndia entertains Afghanistan in Delhi 🏏
— ICC (@ICC) October 11, 2023
Can the hosts make it two wins in two? 🤔#CWC23 | #INDvAFG pic.twitter.com/qVwa32tWuG
-
Hardik Pandya Birthday : పాండ్య దిగితే పూనకాలే.. పాక్‌పై ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ స్పెషల్!
Ind vs Afg World Cup 2023 : పాక్ కంటే ముందు అఫ్గాన్‌తో పోరు.. వారిపైనే ఫోకస్!