ETV Bharat / sports

భారత్​లో అలాంటిది చూసి చాలా కాలమైంది: రోహిత్ శర్మ - rohit sharma news

Rohit Sharma: వెస్టిండీస్​తో సిరీస్​లో చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపాడు టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వన్డే సిరీస్​ను 3-0తో దక్కించుకోవడం తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పాడు.

IND VS WI
rohit sharma news
author img

By

Published : Feb 12, 2022, 8:42 AM IST

Rohit Sharma: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో యువ ఆటగాళ్లు రాణించిన తీరు అద్భుతమని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ అన్నాడు. మూడో వన్డే ముగిసిన అనంతరం.. అతడు మీడియాతో మాట్లాడాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో గెలిచింది.

IND VS WI
సిరీస్​ కైవసం

"ఈ సిరీస్‌లో చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆశించిన దాని కంటే ఆటగాళ్లు మెరుగ్గా రాణించారు. బయటి వ్యక్తులు చేసే విమర్శలను పట్టించుకోం. జట్టు విజయం కోసం ఏం చేయాలో మాకు తెలుసు. రెండో వన్డేలో ప్రసిద్ధ్‌ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్‌లో అలాంటి స్పెల్ చూసి చాలా కాలమైంది. మహమ్మద్‌ సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్‌, దీపక్‌ చాహర్ పరిస్థితులకు అనుగుణంగా రాణించారు. యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్‌ లాంటి స్పిన్నర్లు మాకు చాలా ముఖ్యం. ఈ విజయం మాలో చాలా ఆత్మవిశ్వాసం నింపింది. ఆరంభంలో కీలక వికెట్లు కోల్పోయినా.. మా ఆటగాళ్లు పుంజుకున్న తీరు అద్భుతం"

-రోహిత్‌ శర్మ, కెప్టెన్‌

"ఈ సిరీస్ కంటే ముందు విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడటం నాకు కలిసొచ్చింది. నేను తీసిన వికెట్లలో చాలా మంది వికెట్ కీపర్‌కి చిక్కడమో లేదంటే స్లిప్సులో దొరికిపోవడమో జరిగింది. ఈ సిరీస్‌లో కీలక వికెట్లు పడగొట్టినందుకు ఆనందంగా ఉంది. మిగతా ఆటగాళ్ల నుంచి చక్కటి సహకారం ఉంది. ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. సమష్టిగా రాణించడం వల్లే ఈ విజయం సాధ్యమైంది"

- ప్రసిద్ద్‌ కృష్ణ, ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌

IND VS WI
కప్పుతో భారత్

"గత రెండు నెలలుగా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను. కరోనా నుంచి త్వరగా కోలుకుని గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాను. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు నేను సిద్ధమే. ప్రస్తుత పరిస్థితులను బట్టి నాలుగో స్థానంలో ఆడటం బాగుంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాణించడం గొప్ప అనుభూతి. కొత్త బంతిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అదేమంతా సులభం కాదు. జట్టు పరిస్థితులను బట్టి ఇంకా మెరుగ్గా రాణించాల్సి ఉంది"

-శ్రేయస్‌ అయ్యర్‌, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌

"ముందుగా, టీమ్‌ఇండియాకు అభినందనలు. ఈ సిరీస్‌లో మా బౌలర్లు గొప్పగా రాణించారు. ముఖ్యంగా చివరి రెండు మ్యాచుల్లో ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొట్టి భారత్‌పై ఒత్తిడి పెంచారు. అయితే బౌలింగ్‌తో పాటు, బ్యాటింగ్‌లోనూ మీము ఇంకా మెరుగ్గా రాణించాల్సి ఉంది. పూర్తి ఓవర్లు బ్యాటింగ్‌ చేసేందుకు ఇంకా మీము చాలా మెరుగుపడాలి"

- నికోలస్ పూరన్‌, వెస్టిండీస్‌ కెప్టెన్‌

ఇదీ చూడండి: IND VS WI: విండీస్​పై టీమ్​ఇండియా విక్టరీ.. సిరీస్​ క్లీన్​స్వీప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.