ETV Bharat / sports

టీమ్​ఇండియా టెస్టు కెప్టెన్​గా రోహిత్​ శర్మ - భారత్​ శ్రీలంక సిరీస్

rohit sharma
రోహిత్ శర్మ
author img

By

Published : Feb 19, 2022, 4:32 PM IST

Updated : Feb 19, 2022, 5:26 PM IST

16:29 February 19

వైస్​కెప్టెన్​గా బూమ్రా

team india sri lanka series
బీసీసీఐ ట్వీట్

వన్డే, టీ20లకు టీమ్​ఇండియా కెప్టెన్​గా అదరగొడుతున్న రోహిత్​ శర్మ.. ఇకపై టెస్టులకు పూర్తిస్థాయిలో సారథిగా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఇటీవల టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకొన్న నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకతో త్వరలో ప్రారంభమయ్యే సిరీస్​తో రోహిత్ టెస్టు బాధ్యతలు అందుకోనున్నాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​కు తాత్కాలిక కెప్టెన్​గా కేఎల్​ రాహుల్​ వ్యవహరించాడు. స్టార్​ బౌలర్​ బూమ్రాకు టెస్టు వైస్​ కెప్టెన్​ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ.

టెస్టు స్పెషలిస్టులపై వేటు..

గత కొంతకాలంగా ఫామ్​ లేమితో ఇబ్బందిపడుతున్న అజింక్య రహానె, పుజారాలను టెస్టు జట్టు నుంచి తప్పించారు. రంజీ మ్యాచ్​లతో తిరిగి ఫామ్​లోకి రావాలని ఆటగాళ్లకు సూచించామని సెలక్షన్​ కమిటీ ఛైర్మన్ చేతన్​ శర్మ వెల్లడించారు. వీరితో పాటు కేఎల్​ రాహుల్, వాషింగ్టన్​ సుందర్, శార్దూల్​ ఠాకూర్​లకు విశ్రాంతి ఇచ్చింది. వీరు శ్రీలంకతో సిరీస్​కు దూరంగా ఉంటారని బోర్డు స్పష్టం చేసింది.

రోహిత్​ శర్మ కెప్టెన్సీలో కేఎల్​ రాహుల్​, రిషబ్​ పంత్​, బూమ్రాలు భవిష్యత్తులో జట్టుకు నాయకత్వం వహించేలా తీర్చిదిద్దుతామని బీసీసీఐ పేర్కొంది.

శ్రీలంకతో సిరీస్​లకు భారత జట్టు ఇదే..

టెస్టు జట్టు: రోహిత్​ శర్మ (కెప్టెన్), మయాంక్​ అగర్వాల్​, ప్రియాంక్​ పంచల్, విరాట్​ కోహ్లీ, శ్రేయస్​ అయ్యర్​, హనుమా విహారి, శుభమన్​ గిల్, రిషబ్​ పంత్, కేఎల్​ భరత్, ఆర్​ అశ్విన్, జడేజా, జయంత్​ ఠాకుర్​, కుల్​దీప్​ యాదవ్​, బూమ్రా, షమి, సిరాజ్, ఉమేశ్​ యాదవ్, సౌరభ్​ కుమార్.

టీ20 జట్టు: రోహిత్​ శర్మ (కెప్టెన్) , రుతురాజ్​ గైక్వాడ్​, ఇషాన్​ కిషన్, సూర్యకుమార్​ యాదవ్, శ్రేయస్​ అయ్యర్​, వెంకటేశ్​ అయ్యర్​, దీపక్​ హూడా, బూమ్రా (వైస్​ కెప్టెన్)​, భువనేశ్వర్​ కుమార్, హర్షల్​ పటేల్, మహమ్మద్​ సిరాజ్, సంజు శాంసన్, చాహల్, జడేజా, కుల్​దీప్​ యాదవ్, రవి భిష్ణోయ్, ఆవేశ్​ ఖాన్

Last Updated : Feb 19, 2022, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.