ETV Bharat / sports

రోహిత్ దెబ్బకు డివిలియర్స్​ రికార్డ్ బ్రేక్ - ఆ ఘనత అందుకున్న తొలి కెప్టెన్​గా హిట్​మ్యాన్

Rohit Sharma ODI Record : 2023 ప్రపంచకప్​లో భారత్.. తమ ఆఖరి లీగ్​ మ్యాచ్​లో నెదర్లాండ్స్​తో తలపడుతోంది. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్​ చేస్తున్న టీమ్ఇండియాకు.. ఓపెనర్లు గిల్, రోహిత్ మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ క్రమంలో రోహిత్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అవేంటో తెలుసుకుందాం.

rohit sharma odi record
rohit sharma odi record
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2023, 3:43 PM IST

Rohit Sharma ODI Record : 2023 వరల్డ్​కప్​లో భారత్ - నెదర్లాండ్స్ మధ్య ఆఖరి లీగ్​ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్​కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. వేగంగా పరుగులు సాధిస్తుంది. ఓపెనర్లు శుభ్​మన్ గిల్ (51 పరుగులు), కెప్టెన్ రోహిత్ శర్మ (61) శతక భాగస్వామ్యం నిర్మించారు. స్కోర్ 100 దాటిన తర్వాత గిల్ (51) ఔటవగా.. 17.4 ఓవర్​ వద్ద రోహిత్ క్యాటౌట్​గా పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలో రోహిత్ అధిగమించిన రికార్డులపై ఓ లుక్కేద్దామా

  • ఈ సంవత్సరం రోహిత్ ఇప్పటివరకు.. వన్డేల్లో 60 సిక్స్​లు బాదాడు. ఈ క్రమంలో అతడు ఒక క్యాలెండర్ ఇయర్​లో అత్యధిక సిక్స్​లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. అతడు సౌతాఫ్రికా బ్యాటర్ ఏబీ డివిలియర్స్​ (58 సిక్స్​లు) రికార్డు బద్దలుకొట్టాడు.
  • ఓపెనర్​గా రోహిత్.. 14000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. అతడు నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో అతడి కంటే ముందు.. వీరేంద్ర సెహ్వాగ్ (16119), సచిన్ తెందూల్కర్ (15335) ఉన్నారు.
  • వరల్డ్​కప్ హిస్టరీలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మూడో బ్యాటర్​గా రోహిత్ (13) నిలిచాడు. ఈ లిస్ట్​లో అతడి కంటే ముందు మాస్టర్ బ్లాస్టర్​ సచిన్ తెందూల్కర్ (21), విరాట్ కోహ్లీ (14) ఉన్నారు.
  • ఈ సంవత్సరం వన్డేల్లో అత్యధిక శతక భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడిగా శుభ్​మన్ - రోహిత్ నిలిచారు. వీరిద్దరూ ఈ ఏడాది వన్డేల్లో 5 సార్లు సెంచరీ పార్ట్​నర్​షిప్ చేశారు.
  • ప్రపంచకప్​ ఎడిషన్​లో అత్యధిక పరుగులు బాదిన టీమ్ఇండియా కెప్టెన్​గా రోహిత్ రికార్డుకొట్టాడు. ఈ వరల్డ్​కప్​లో రోహిత్ ఇప్పటివరకు 503 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు సౌరభ్ గంగూలీ (465)ని వెనక్కినెట్టాడు.
  • వరల్డ్​కప్ హిస్టరీలో రెండుసార్లు 500+ పరుగులు సాధించిన బ్యాటర్​గా రోహిత్ (2019, 2023).. సచిన్​ (1996, 2003) ను సమం చేశాడు.
  • ఈ మ్యాచ్​లో ఫిిఫ్టీతో రోహిత్.. 100 అంతర్జాతీయ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.
    • Records of Rohit Sharma today:

      - First player to score 500+ runs in back to back World Cups
      - Most sixes in a calendar year in ODIs
      - Most sixes in a World Cup edition as a captain
      - Most fours in a World Cup edition as a captain
      - Most runs as an Indian captain in single World… pic.twitter.com/0Qyyli9ZVR

      — Johns. (@CricCrazyJohns) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.