ETV Bharat / sports

'ముంబయిపై నీ ముద్ర చెరగనిది- ఎప్పటికీ నువ్వే మా కెప్టెన్​' - rohit sharma ipl captaincy

Rohit Sharma Mumbai Indians : ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్​కు అప్పగించిన నేపథ్యలో, జట్టుకు రోహిత్ అందించిన సేవలు అసాధారణం అని ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది.

rohit sharma mumbai indians
rohit sharma mumbai indians
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 9:37 PM IST

Updated : Dec 15, 2023, 10:50 PM IST

Rohit Sharma Mumbai Indians : ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ అప్పగించిన తర్వాత, రోహిత్ శర్మను ఉద్దేశించి ట్విట్టర్​లో పోస్ట్ షేర్ చేసింది. రోహిత్ పేరు ముంబయి ఇండియన్స్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొంది. '2013లో నువ్వు నాయకత్వ బాధ్యతలు తీసుకొని నాపై నమ్మకం ఉంచమని కోరావు. గెలుపు, ఓటముల్లో ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలన్నావు. ఈ పదేళ్లలో ఆరు టోఫ్రీలు (5 ఐపీఎల్​, 1 ఛాంపియన్స్​ లీగ్) అందించావు. ఎప్పటికీ నువ్వు మా కెప్టెన్​వే. ముంబయి ఇండియన్స్​పై నీ ముద్ర చెరగనిది. థాంక్యూ, కెప్టెన్ రోహిత్. ముంబయి కా రాజా' అంటూ ఎమోషనల్​గా రాసుకొచ్చింది.

  • Ro,
    In 2013 you took over as captain of MI. You asked us to 𝐁𝐞𝐥𝐢𝐞𝐯𝐞. In victories & defeats, you asked us to 𝘚𝘮𝘪𝘭𝘦. 10 years & 6 trophies later, here we are. Our 𝐟𝐨𝐫𝐞𝐯𝐞𝐫 𝐜𝐚𝐩𝐭𝐚𝐢𝐧, your legacy will be etched in Blue & Gold. Thank you, 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐑𝐎💙 pic.twitter.com/KDIPCkIVop

    — Mumbai Indians (@mipaltan) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Rohit Sharma IPL Winning Streak : కాగా, 2013 సీజన్​ మధ్యలో రోహిత్ కెప్టెన్సీ అందుకున్నాడు. అప్పటికి ఐదేళ్లుగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా వరల్డ్​కప్ విన్నింగ్ కెప్టెన్ రికీ పాంటింగ్​కు సాధ్యం కాని ఐపీఎల్​ టైటిల్​ను ముంబయికి రోహిత్ అందించాడు. ఆ తర్వాత కెప్టెన్​గా అనేక రికార్డులు అందుకున్నాడు రోహిత్. అతడు ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన రెండో కెప్టెన్​గా నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో 158 మ్యాచ్​ల్లో 87 సార్లు ముంబయి ఇండియన్స్​ నెగ్గింది. అంటే రోహిత్ విన్నింగ్ పర్సెంటేజీ 55.06గా ఉంది. అతడి కంటే ముందు మహేంద్రసింగ్ ధోనీ మాత్రమే ఉన్నాడు. ధోనీ 58.84 విన్నింగ్ పర్సెంటేజీతో 226 మ్యాచ్​ల్లో 133 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజేతగా నిలిపాడు.

Rohit Sharma IPL Titles : ఏ కెప్టెన్​కు సాధ్యంకాని విధంగా రోహిత్, ముంబయిని 5సార్లు ఛాంపియన్​గా నిలిపాడు. ఈ క్రమంలో ఐపీఎల్​లో ఐదు టైటిళ్లు (2013, 2015, 2017, 2019, 2020) సాధించిన తొలి కెప్టెన్​గా నిలిచాడు. ఇక ముంబయి ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయం పట్ల రోహిత్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. రోహిత్​కు దక్కాల్సిన గౌరవం ఇది కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.

Last Updated : Dec 15, 2023, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.