ETV Bharat / sports

'పాక్​ ఫ్యాన్స్​కు కోహ్లీ కంటే రోహిత్​ అంటేనే ఎక్కువ ఇష్టం' - Shoaib Akthar on Rohit Sharma

పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు టీమ్​ఇండియా ఆటగాళ్లను బాగా ఆదరిస్తారని తెలిపాడు ఆ దేశ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్(Shoaib Akthar News). కోహ్లీ కంటే రోహిత్​ శర్మ అంటే వారికి ఎక్కువ ఇష్టమని తెలిపాడు. మరో రెండు రోజుల్లో భారత్, పాక్​ మ్యాచ్(Ind vs Pak T20 World Cup) జరగనున్న నేపథ్యంలో అక్తర్(Shoaib Akhtar on India) ఈ వ్యాఖ్యలు చేశాడు.

Shaoib akthar
షోయబ్ అక్తర్
author img

By

Published : Oct 22, 2021, 3:41 PM IST

టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మపై ఆసక్తికర కామెంట్స్​ చేశాడు పాకిస్థాన్​ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్(Shoaib Akthar on Rohit Sharma). భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ కంటే వైస్​ కెప్టెన్​ రోహిత్ శర్మనే(Shoaib Akthar on India) పాకిస్థాన్​ అభిమానులు ఎక్కువగా ఇష్టపడతారని పేర్కొన్నాడు. తమ దేశ క్రికెట్​ అభిమానులు రోహిత్​ను 'ఇండియా కా ఇంజమామ్' అని అభివర్ణిస్తారని తెలిపాడు. టీ20 ప్రపంచకప్​ సందర్భంగా భారత్, పాకిస్థాన్ హై వోల్టేజీ​ మ్యాచ్(Ind vs Pak T20 World Cup) మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో అక్తర్​ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

"భారత్​కు మంచి క్రికెట్ జట్టు లేదని చెప్పే​ వారెవరూ పాకిస్థాన్​లో లేరు. విరాట్​ ఓ గొప్ప ఆటగాడని, రోహిత్​ ఎవర్​గ్రీన్​ ఆటగాడని వారు భావిస్తారు. రోహిత్​ను వారు 'ఇండియా కా ఇంజమామ్ ఉల్ హక్​' అని పిలుస్తారు. ఆస్ట్రేలియాలో రిషబ్​ పంత్​ ఆడిన తీరును వారు మెచ్చుకుంటారు. సూర్యకుమార్​ యాదవ్​నూ ప్రశంసిస్తారు. పాకిస్థాన్​ ప్రేక్షకులకు ఇండియా ఆటగాళ్లపై మంచి అభిప్రాయం ఉంది."

--షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ ఆటగాడు.

పాకిస్థాన్​పై రోహిత్​ శర్మకు మెరుగైన రికార్డు ఉంది. అలాగే.. వరల్డ్​కప్​లో భారత్​పై ఇప్పటివరకూ పాకిస్థాన్​ ఒక్క మ్యాచ్​ గెలవలేదు.

ఇదీ చదవండి:

భారత్-పాక్ పోరు.. ఈ వివాదాలు ఎప్పటికీ మర్చిపోలేరు!

T20 World Cup: భారత్​కు బయోబబుల్ గండం.. అదొక్కటే ధైర్యం ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.