ETV Bharat / sports

WTC Final​కు ఇంకొక్క రోజే.. రోహిత్​కు గాయం! ఆందోళనలో అభిమానులు

Rohit Sharma Injury WTC Final : డబ్ల్యూటీసీ ఫైనల్​కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉండగా.. టీమ్​ఇండియాను కలవరపెట్టే విషయం ఒకటి తెలిసింది. జట్టు సారథి రోహిత్​ శర్మకు గాయం అయిందని తెలుస్తోంది. ఆ వివరాలు..

Rohith sharma injured
Rohith sharma injured
author img

By

Published : Jun 6, 2023, 5:20 PM IST

Updated : Jun 6, 2023, 5:47 PM IST

Rohit Sharma Injury WTC Final : బుధవారం డబ్ల్యూటీసీ (వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​షిప్​) ఫైనల్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్​ఇండియాకు పెద్ద షాక్​ తగిలింది! ప్రాక్టీస్​ చేస్తున్న సమయంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్​ శర్మకు గాయం అయిందని తెలుస్తోంది. రోహిత్​ చేతి వేలికి గాయం అయినట్లు సమాచారం. ఈ క్రమంలో హిట్​మ్యాన్​​ చేతి వేలికి బ్యాండేజ్​ వేసుకున్న ఫొటో నెట్టింట్లో వైరల్​ అవుతోంది. అయితే రోహత్​కు టీమ్​ఇండియా ఫిజియోలు వైద్య సహాయం అందిచారని.. చేతికి బ్యాండేజ్​ వేసుకున్న తర్వాత రోహిత్​ తిరిగి ప్రాక్టీస్​ సెషన్స్​లో పాల్గొన్నట్లు సమాచారం. దీన్ని బట్టి గాయం అంత తీవ్రమైనదేమీ కాదని అర్ధమవుతోంది. అయితే రోహిత్​ గాయం తీవ్రత, తదితర అంశాలపై ఇంకా ఎవరూ స్పందించలేదు.

ఇకపోతే సోమవారం ప్రాక్టీస్​ సమయంలోనూ యువ బ్యాటర్​ ఇషాన్​ కిషన్ కూడా స్వల్పంగా గాయపడ్డాడని సమాచారం. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్​ ముందు ప్లేయర్లకు వరుసగా గాయాల అవుతుండటం వల్ల అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం నుంచి ఇంగ్లాండ్​లోని ఓవల్​ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్​ పోరులో టీమ్​ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్​కు రోహిత్​ శర్మ అందుబాటులో ఉండాలని ఫ్యాన్స్​ కోరుకుంటున్నారు. అతడు రాణించి భారత్​కు కప్పు తేవాలని ఆశిస్తున్నారు. గణాంకాల పరంగా చూసుకున్నా.. ఇంగ్లాండ్​లో రోహిత్​కు మంచి రికార్డు ఉంది. అక్కడ 5 టెస్టులు ఆడిన రోహిత్​ 402 పరుగులు చేశాడు. ఇక 2021లో ఓవల్​లో అతడు సెంచరీ (127) చేయడం విశేషం. ఇప్పటికే ఆస్ట్రేలియా, టీమ్ఇండియా తమ జట్లను ప్రకటించాయి.

టీమ్​ఇండియా జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, అజింక్య రహానె, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్‌, ఉమేశ్ యాదవ్.
స్టాండ్‌బై ఆటగాళ్లు : యశస్వి జైస్వాల్, ముఖేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్.

ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్‌ కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కెరీ (వికెట్ కీపర్‌), కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌ కీపర్‌), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నేసర్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.
స్టాండ్‌బై ఆటగాళ్లు : మిచెల్ మార్ష్, మాట్‌ రెన్‌షా.

Last Updated : Jun 6, 2023, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.