Rohit Sharma Injury Update: టీమ్‌ఇండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ రోహిత్‌శర్మ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. వచ్చేనెలలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు. ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు మూడేసి వన్డేలు, టీ20 మ్యాచ్‌ల్లో భారత్.. విండీస్ తలపడతాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నెట్ ప్రాక్టీసులో రోహిత్‌కు తొడ కండరాల గాయమైంది. దీంతో అతను సఫారీ పర్యటనకు దూరమయ్యాడు.
"జాతీయ క్రికెట్ అకాడమీలో రోహిత్ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. విండీస్‌తో సిరీస్‌కు అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముంది. ఫిబ్రవరి 6న అహ్మదాబాద్‌లో జరిగే తొలి వన్డేకు ఇంకా మూడు వారాల సమయం ఉంది" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
టెస్టు కెప్టెన్‌గా..
టీమ్‌ఇండియా టెస్టు జట్టుకు సారథిగా తప్పుకుంటున్నట్లు ఇటీవలే విరాట్ కోహ్లీ ప్రకటించిన నేపథ్యంలో తర్వాతి కెప్టెన్ ఎవరన్న అంశం చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఈ పదవికి ముగ్గురు ఆటగాళ్లు సరిపోతారని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్.. ఈ ముగ్గురిలో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వాలని అన్నాడు.
"టెస్టు కెప్టెన్ పదవి రోహిత్ శర్మకు అప్పగిస్తారన్న విషయం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవలే అతడిని టీ20, వన్డే జట్టుకు కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. అయితే.. గతేడాది నుంచి అతడు ఫిట్‌నెస్ సమస్యల కారణంగా బాధపడుతున్నాడు. దీనిపై దృష్టి సారించాల్సి ఉంది." అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:
Rohit Sharma News: భార్య పేరిట ఖరీదైన స్థలం కొన్న రోహిత్ శర్మ