Rohit Sharma Family Vacation : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, క్రికెట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో ఇటీవల ఇంగ్లాండ్ వెళ్లాడు. ఈ వెకేషన్లో రోహిత్, తన భార్య రితికా సజ్దే, కూతురు సమైరాతో కలిసి గడిపాడు. కాగా, సౌతాఫ్రికా పర్యటనకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోహిత్, సోమవారం భారత్‌కు బయల్దేరాడు. అతడు ఫ్యామిలీతో ముంబయి ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక రోహిత్ త్వరలోనే టీమ్ఇండియా జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది.
-
Captain Rohit Sharma with his family has returned to Mumbai from London.
— 𝐂𝐡𝐚𝐢𝐭𝐡𝐮 🇮🇳 Stay Strong Rohit (@ChaitRo45) December 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Please smile @ImRo45 🥺 pic.twitter.com/vsTYz0HE3w
">Captain Rohit Sharma with his family has returned to Mumbai from London.
— 𝐂𝐡𝐚𝐢𝐭𝐡𝐮 🇮🇳 Stay Strong Rohit (@ChaitRo45) December 4, 2023
Please smile @ImRo45 🥺 pic.twitter.com/vsTYz0HE3wCaptain Rohit Sharma with his family has returned to Mumbai from London.
— 𝐂𝐡𝐚𝐢𝐭𝐡𝐮 🇮🇳 Stay Strong Rohit (@ChaitRo45) December 4, 2023
Please smile @ImRo45 🥺 pic.twitter.com/vsTYz0HE3w
రోహిత్ శర్మ గత నాలుగు నెలల నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. 2023 ఆసియా కప్, 2023 వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో టీమ్ఇండియాకు సారథ్యం వహించాడు. ఇక రోహిత్ కెప్టెన్సీలోనే భారత్, ఎనిమిదోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. తాజాగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. కానీ, ఫైనల్లో అనూహ్యంగా ఆస్ట్రేలియా చేతిలో ఓడి, రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మెగా టోర్నీలో హిట్‌మ్యాన్ 11 ఇన్నింగ్స్‌ల్లో 597 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా నిలిచాడు.
India Tour Of South Africa : డిసెంబర్లో టీమ్ఇండియా, సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. సఫారీ గడ్డపై టీమ్ఇండియా 3 టీ20, 3 వన్డే, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించింది బీసీసీఐ. టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ కాగా, వన్డేల్లో భారత్‌కు కేఎల్ రాహుల్, టెస్టుల్లో రోహిత్ శర్మ టీమ్ఇండియాను నడిపించనున్నారు.
Virat Kohli Break From White Ball Cricket : ఇక టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సఫారీ పర్యటనలో వైట్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండాలని ఇటీవల నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు విరాట్. ఇక సఫారీలతో డిసెంబర్ 26న ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌లో యథావిధిగా ఆడనున్నాడు.
మొహంపై గాయాలు, ముక్కుపై బ్యాండేజీ - ఈ ఫొటో మెసేజ్ ఏంటంటే?
'రోహిత్'కు మెసేజ్ చేయాలని ఉంది - ఆ విషయంలో అతడికి థాంక్స్ చెప్పాలి