టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ 2019 వన్డే ప్రపంచకప్ ప్రదర్శనను మరోసారి పునరావృతం చేస్తాడని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసులో అతడు భారీ స్థాయిలో పరుగులు చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లిష్ పిచ్‌లపై అతడి బ్యాటింగ్ టెక్నిక్‌ను చక్కగా మార్చుకున్నాడని వెల్లడించాడు.
'ఇంగ్లాండ్‌లో రెండేళ్ల క్రితం జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఐదు శతకాలు చేయడం మనం చూశాం. సౌథాంప్టన్‌లో కఠినమైన పిచ్‌పై, చల్లని వాతావరణంలో అద్భుతమైన శతకం చేశాడు. పరిస్థితులకు తగ్గట్టుగా టెక్నిక్‌ను మార్చుకున్నాడు. ఈ రెండేళ్లలో అతడు మరింత అనుభవం సంపాదించాడు. ఈ టెస్టు సిరీసులో అతడు అలాంటి ప్రదర్శనే పునరావృతం చేస్తే నాకేమీ ఆశ్చర్యం లేదు' అని గావస్కర్ అన్నాడు.
గత ప్రపంచకప్‌లో రోహిత్ ఐదు శతకాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. సఫారీలపై సౌథాంప్టన్‌లో 122 బంతుల్లోనే 144 పరుగులు చేశాడు. 13 బౌండరీలు, 2 సిక్సర్లు బాదేశాడు. ఇక త్వరలో జరిగే ఐదు టెస్టుల సిరీసులో హిట్‌మ్యాన్ కీలకం కానున్నాడు. ఓపెనర్‌గా అతడు చేసే పరుగులే జట్టుకు కీలకం కానున్నాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ అతడు శుభారంభమే అందించాడు.
ఇవీ చదవండి:Rohit Sharma: రోహిత్‌శర్మ 'ప్రపంచకప్' రికార్డుకు రెండేళ్లు