ETV Bharat / sports

రోహిత్-దినేశ్ కార్తీక్​.. ఆ మ్యాజిక్ రిపీట్​ అవుతుందా? - dinesh karthik in 2022 world cup

టీ20 ప్రపంచకప్​ జట్టు ప్రకటించిన తర్వాత ఫ్యాన్స్​.. తమ అంచనాలను, విశ్లేషణలను, సెంటిమెంట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ‌లకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్​ మ్యాటర్​ను పోస్ట్​ చేస్తున్నారు. అదేంటంటే..

rohith sharma
రోహిత్​ శర్మ దినేశ్​ కార్తిక్​ టీ20 ప్రపంచకప్​
author img

By

Published : Sep 13, 2022, 12:47 PM IST

టీమ్​ఇండియా సీనియర్​ ​వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ టీ20 ప్రపంచకప్​ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత రెండున్నరేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న కార్తిక్​ ఐపీఎల్​ 2022లో ఆర్సీబీ తరఫున బరిలో దిగి సంచలన ప్రదర్శనతో టీమ్​ఇండియాలో చోటు సంపాదించుకున్నాడు. ఈ ఊపులోనే ఇటీవలే జరిగిన ఆసియాకప్​తో పాటు ఇప్పుడు తాజాగా టీ20 ప్రపంచకప్​లోనూ అతడికి స్థానం దక్కింది. అయితే టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటించిన వెంటనే ఫ్యాన్స్ తమ అంచనాలను, విశ్లేషణలను, సెంటిమెంట్స్‌ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్​ చేస్తున్నారు. అయితే దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ‌లకు సంబంధించిన ఓ సెంటిమెంట్ భారత అభిమానులను ఆకట్టుకుంటుంది. అదేంటంటే..

15ఏళ్ల తర్వాత.. కెప్టెన్​ రోహిత్ శర్మతో కలిసి దినేశ్​ కార్తీక్​.. దాదాపు 15 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ ఆడనున్నాడు. 2007లో జరిగిన టీ 20 వరల్డ్ కప్​లో 'అండర్‌ డాగ్స్‌'గా బరిలో దిగిన టీమ్​ఇండియా జట్టులో వీరిద్దరు ఆడారు. అప్పుడు టీమ్​ఇండియా గెలిచింది.

కార్తీక్, రోహిత్ ఇద్దరే.. ఈ టోర్నీ తర్వాత ఆరు టీ20 ప్రపంచకప్​లు జరిగాయి. కానీ ఈ టోర్నీల్లో దినేశ్, రోహిత్ మళ్లీ కలిసి ఆడలేదు. ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి ప్రపంచకప్‌ బరిలోకి దిగనున్నారు. మరి 2007 టీ20 వరల్డ్ కప్ మ్యాజిక్​ రిపీట్​ అవుతుందా లేదా అన్న ఆలోచన అభిమానుల మదిలో ఏర్పడింది. ఈ సెంటిమెంట్ భారత జట్టుకు కలిసి వస్తుందా? అని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2007 టీ20 ప్రపంచకప్ భారత జట్టులో ఆడిన పియూష్ చావ్లా, రాబిన్ ఊతప్ప, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ మాత్రమే ఇంకా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోలేదు. చావ్లా, ఊతప్ప రిటైర్మెంట్ తీసుకోకపోయినప్పటికి జట్టుకు దూరంగా ఉంటున్నారు..

ఇదీ చదవండి: నా కల నెరవేరిందోచ్​.. ఫుల్​ ఖుషీలో దినేశ్​కార్తీక్​

అయ్యో పాపం.. ఈ ప్లేయర్​ అన్నీ గోల్డెన్​ డకౌట్లే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.