Rohit comment on players mental health: టీమ్ఇండియా ఆటగాళ్లలో ప్రతి వ్యక్తి మానసిక స్థితి భిన్నంగా ఉంటుందన్నారు కెప్టెన్ రోహిత్ శర్మ. సమస్యను ఎదుర్కొనేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొ రకంగా ఆలోచిస్తారని అభిప్రాయపడ్డాడు రోహిత్. స్టార్ స్పోర్ట్స్‌తో పలు విషయాలను షేర్ చేసుకున్నాడు రోహిత్ శర్మ.
ఆసియా కప్ ఆరంభం నేపథ్యంలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను తెలిపాడు. 'గత పదేళ్లలో నెల రోజుల పాటు నేను బ్యాట్‌ను పట్టుకోకుండా ఉండటం ఇదే తొలిసారి. ఇటీవల కొన్ని రోజుల పాటు నా సామర్థ్యాన్ని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నానని గ్రహించాను' అని కోహ్లీ అన్నారు. విరాట్ వ్యాఖ్యల నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. విరాట్ మాత్రమే కాకుండా పలువురు భారత ఆటగాళ్లు మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు అండగా ఉన్నాడని తెలిపాడు.
"మేం (ఆటగాళ్లు) మానసిక ఒత్తిడి గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. కొవిడ్ సమయంలో విరాట్‌కే కాకుండా చాలా మంది ఆటగాళ్లకు కష్టంగా ఉంది. చాలా మంది ఆటగాళ్లు మానసికంగా కష్ట సమయాలను ఎదుర్కొన్నారు. బయోబబుల్, హోటళ్ల నుంచి బయటకు వెళ్లలేక పోవడం వంటివి తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశాయి. కొవిడ్ తర్వాత ఫైవ్ స్టార్ హోటళ్లు జైళ్లలా అనిపించాయి. ఆఖరికి సూర్యరశ్మి, మట్టిని కూడా చూడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొవిడ్ అంతటి భయానక పరిస్థితులను సృష్టించింది. మానసిక ఆరోగ్యం ఆటగాళ్లకి చాలా ముఖ్యం."
--రోహిత్ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్
ఇవీ చదవండి: పంత్‌లా బ్యాటింగ్ చేయాలని ఉందన్న పాక్ స్టార్ బౌలర్
దాయాదితో పోరుకు భారత్ సిద్ధం, కసితో రోహిత్ సేన, మరోసారి నెగ్గాలని పాక్ వ్యూహం