Rohit Sharma Coach Dinesh Lad : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శనివారం భారత్-పాకిస్థాన్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం కోట్లాది క్రికెట్ ప్రియులు వేచి చూస్తున్నారు. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో టీమ్ఇండియా మంచి ఫామ్‌లో ఉంది. పాక్ కూడా కెప్టెన్ బాబర్ ఆజమ్, రిజ్వాన్ వంటి యువ ప్లేయర్లతో పటిష్ఠంగా ఉంది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి టీమ్ఇండియా బ్యాటర్, కెప్టెన్ రోహిత్ శర్మపైనే ఉంది. ఎందుకంటే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ అయ్యాడు. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో(131) అదరగొట్టాడు. అంతేగాక ఇంటర్నేషనల్ కెరీర్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో రోహిత్ బ్యాటింగ్ గురించి ఆయన చిన్ననాటి కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో చూద్దాం.
రోహిత్ శర్మ షాట్ల ఎంపిక ప్రస్తుతం చాలా బాగుందని అన్నాడు రోహిత్ చిన్నప్పటి కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్. అందుకే రోహిత్ వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో నాలుగు శతకాలు, టెస్ట్ క్రికెట్లో ఒక డబుల్ సెంచరీ బాదాడని అన్నాడు. ప్రస్తుతం రోహిత్ పుల్ షాట్, లాఫ్ట్డ్ షాట్లతో అదరగొడుతున్నాడని చెప్పాడు.
2009 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మకు పెద్దగా అవకాశాలు రాలేదని రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ అన్నాడు. ఆ తర్వాత 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మను అప్పటి టీమ్ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓపెనర్‌గా పంపించాడని.. అప్పటి నుంచి రోహిత్ వెనుదిరిగి చూసుకోలేదని చెప్పాడు.
రోహిత్ శర్మ 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అదే ఏడాది జూన్ 23 ఐర్లాండ్‌తో భారత్ తలపడిన మ్యాచే రోహిత్‌కు మొదటిది. ఆ తర్వాత రోహిత్ ప్రయాణం ఒడుదొడుకుల మధ్య సాగింది. 2011 తర్వాత తన బ్యాటింగ్ స్టైల్‌ను మార్చుకున్నాడు రోహిత్. పుల్ షాట్, కట్ షాట్, స్ట్రైట్ డ్రైవ్, ఫ్లిక్ షాట్లలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆ తర్వాత ఆడిన ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌లలో ఆ షాట్లను ఆడి రోహిత్ మరింత ఆరితేరి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్. షాట్ల ఎంపికలో రోహిత్ మెరుగుపడడానికి టీ20 ఫార్మాటే కారణమని ఆయన ఈటీవీ భారత్‌కు చెప్పాడు.
Rohit Sharma On Chris Gayle : అతడి బుక్ నుంచి తీసుకుంది ఒక పేజీనే.. 'గేల్' ఎప్పటికీ యూనివర్స్ బాసే
Rohit Sharma World Cup 2023 : మెగా సమరంలో రోహిత్ రికార్డులు.. హిట్‌మ్యాన్ విధ్వంసానికి కారణమిదే!