ETV Bharat / sports

Rohit Sharma Car Number Plate : రోహిత్‌ కార్‌ నంబర్‌కు అతడి సూపర్ రికార్డ్​ లింక్‌.. అదేంటంటే? - రోహిత్ శర్మ లంబోర్గిని యూరస్‌ కారు

Rohit Sharma Car Number Plate : టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ లగ్జరీ లంబోర్గిని యూరస్‌ కారుకు.. అతడు వన్డే క్రికెట్‌లో నెలకొల్పిన ఓ రికార్డుకు లింక్‌ ఉంది. అదేంటంటే?

Rohit Sharma Car Number Plate
Rohit Sharma Car Number Plate : రోహిత్‌ కార్‌ నంబర్‌కు అతడి సూపర్ రికార్డ్​ లింక్‌.. అదేంటంటే?
author img

By

Published : Aug 10, 2023, 6:59 PM IST

Rohit Sharma Car Number Plate : రీసెంట్​గా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ బరిలోకి దిగిన టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ప్రస్తుతం రెస్ట్​లో ఉన్నారు. వెస్టిండీస్​తో జరుగుతున్న టీ20 సిరీస్‌తో పాటు త్వరలోనే జరగనున్న ఐర్లాండ్‌ పొట్టి సిరీస్‌కు కూడా ఈ ప్లేయర్స్​ దూరంగా ఉండనున్నారు.

దీంతో ఈ ప్లేయర్సంతా ఈ విరామ సమయాన్ని ఫ్యామిలీతో కలిసి ఫుల్​ ఎంజాయ్‌ చేస్తున్నారు. కెప్టెన్​ రోహిత్‌ శర్మ కూడా మొన్నటివరకు అమెరికా పర్యటనలో ఉన్నాడు. గత వారం కాలిఫోర్నియాలో తన క్రికెట్ అకాడమీని గ్రాండ్​గా ప్రారంభించి రీసెంట్​గా ముంబయికి చేరుకున్నాడు. తాజాగా అతడు తన సతీమణి రితికా సజ్దెతో కలిసి ఓ ఖరీదైన కారులో అడీడాస్‌ స్టోర్‌కు వెళ్లాడు. రూ.4.20 కోట్ల విలువ చేసే విలాసవంతమైన లంబోర్గిని యూరస్‌ కారులో(Rohit Sharma Lamborghini Urus) అతడు ఆ స్టోర్‌కు వచ్చాడు.

అయితే హిట్​మ్యాన్​ రాకను గమనించిన అక్కడి అభిమానులు.. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రోహిత్​ శర్మను చాలా దగ్గర నుంచి చూస్తూ తెగ ఆనందపడిపోయారు. కొంతమందైతే తమ సెల్​ఫోన్లలో ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో పోస్ట్ చేయడం ప్రారంభించారు. అయితే కాసేపటి తర్వాత హిట్​మ్యాన్​ తన భార్యను తీసుకుని అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Rohit Sharma Highest Individual Score In ODI : ఈ వీడియో ట్రెండ్ అవుతున్న సమయంలో కొంతమంది అభిమానులు, నెటిజన్లు ఈ వీడియోలో ఓ ఆసక్తికర విషయాన్ని గమించారు. అదేంటంటే.. రోహిత్ శర్మ కారు నెంబర్​.. అతడు తన వన్డే కెరీర్‌లో సాధించిన ఓ అరుదైన రికార్డుకు లింక్‌ అయి ఉండటం విశేషం. వన్డేల్లో రోహిత్‌ శర్మ అత్యధిక వ్యక్తిగత స్కోరు 264గా ఉంది. ఇదే నంబర్‌ అతడి కారుకు కూడా ఉంది. 0264గా అతడి కారు నంబర్‌ ఉంది. దీన్నే ఫ్యాన్స్ గమనించారు. ఇకపోతే ఈ లగ్జరీ కారును హిట్​మ్యాన్​ గతేడాది మార్చిలో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

రోహిత్​ గారాలపట్టికి 'తిలక్'​ హాఫ్ సెంచరీ అంకితం.. పంత్​ రికార్డు బద్దలు కొట్టిన హైదరాబాదీ

Rohit sharma retirement news : 'అప్పటి వరకు ఆడాలని అనుకుంటున్నాను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.