ETV Bharat / sports

రోహిత్​ - టీమ్ఇండియాకు నువ్వు కావాలయ్యా!

Rohit Sharma BCCI : ప్రపంచకప్ తర్వాత భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతోంది. అయితే దీని తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో గురువారం తుది జట్టును ప్రకటించాలని బీసీసీఐ ప్లాన్​ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మను ఆడించాలని ప్రయత్నాలు చేస్తోంది.

Rohit Sharma BCCI
Rohit Sharma BCCI
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 12:55 PM IST

Rohit Sharma BCCI : వరల్డ్​ కప్​ తర్వాత టీమ్ఇండియా ప్రస్తుతం టీ20 ఫార్మాట్​పై ఫోకస్​ పెట్టింది. అలా వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉన్న భారత జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్​ ఆడుతోంది. ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్​కు పయనమవ్వనుంది. అయితే ఇందుకు సంబంధించిన తుది జట్టును గురువారం ప్రకటించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆ జట్టులో యంగ్ ప్లేయర్స్​తో పాటు రోహిత్ శర్మను ఆడించాలని భావిస్తోంది. కానీ ఈ విషయంపై రోహిత్​ సుముఖత చూపించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ.. పట్టువదలకుండా రోహిత్​ను ఈ జట్టులో చేర్చేందుకు బీసీసీఐ భారీ ప్లాన్స్​ వేస్తోంది.

గతేడాది టీ20 ప్రపంచకప్ ఓటమి తర్వాత ఈ ఫార్మాట్‌లో రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఇటీవలే జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్.. సౌతాఫ్రికాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్​కు దూరంగా ఉండాలని అనుకున్నాడట. రోహిత్​లాగా విరాట్ కూడా ఇదే డెసిషన్​ తీసుకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రోహిత్ గైర్హాజరీలో టీ20లు, వన్డేల్లో టీమ్ఇండియాకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడు. కానీ గాయం కారణంగా హార్దిక్​ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు.

ఇక సౌతాఫ్రికా సిరీస్​ సమయానికి పాండ్య పూర్తిగా ఫిట్‌నెస్ సాధించడం అనేది సాధ్యం కాదని విశ్లేషకుల అంచనా. మరోవైపు ఇప్పుడు జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీసులోనూ రోహిత్, పాండ్య ఆడటం లేదు. దీంతో జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్​లోనూ సూర్యకుమార్​ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సఫారీ గడ్డపై ఈ యంగ్​ ప్లేయర్​కు కెప్టెన్సీ విషయంలో సమస్యలు తలెత్తే సూచలను కనిపిస్తున్నాయి. దీంతో రోహిత్‌ను ఎలాగైనా ఒప్పించి, టీ20 సిరీస్‌లో జట్టు సారథ్య పగ్గాలు ఇవ్వాలని బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే కోహ్లి మాత్రం టీ20లతో పాటు వన్డేలకు కూడా దూరంగా ఉండాలనుకుంటున్నాడట. ఇప్పుటికీ ఈ విషయంపై బీసీసీఐకి కూడా అతను క్లారిటీ ఇచ్చాడట. దీంతో ఇప్పుడు బీసీసీఐ రోహిత్​పైనే ఆశలు పెట్టుకుంది.

'విరాట్, రోహిత్ టీ20ల్లోనూ ఆడాలి - లేదంటే వారి ఫేర్​వెల్ బాధ్యత హార్దిక్​దే' : షోయబ్

'టీ20 భవిష్యత్​పై నిర్ణయం మీదే' - రోహిత్​, విరాట్​కు బీసీసీఐ ఫుల్ ఫ్రీడమ్! - ఆడాల్సిందేనంటూ ఫ్యాన్స్​ రిక్వెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.