Rohit Sharma Asia Cup 2023 : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్.. తన కెరీర్లో అనేక మైలురాయిలను సాధించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లతోపాటు పాటు ఆసియా కప్‌లోనూ పలు రికార్డులను నమోదు చేశాడు. సచిన్ ఆడిన 6 ఆసియా కప్ టోర్నమెంట్లలో మొత్తం 900లకు పైగా పరుగులు సాధించాడు. అంతేకాకుండా.. తన చివరి మ్యాచ్ కూడా ఈ టోర్నమెంట్‌లోనే ఆడాడు. 2012 ఆసియా కప్ డిసెంబరులో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచే సచిన్ చివరిది.
అయితే త్వరలోనే ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఆసియా జట్లు పాల్గొనే ఈ టోర్నీ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే టీమ్ఇండియా మాజీ దిగ్గజం సచిన్ నెలకొల్పిన పలు రికార్డులను ఈ సారి కెప్టెన్ రోహిత్ శర్మ బద్దలు కొట్టే అవకాశముంది. ఎందుకంటే ఈ టోర్నీల్లో ఆడిన అనుభవం రోహిత్‌కు అధికంగా ఉండటం, స్థిరంగా రాణించడమే కారణం. మరి ఆ రికార్డులేంటి?
టీమ్ఇండియా తరఫున అత్యధిక స్కోరు
Highest average for India in Asia Cup : ఆసియా కప్‌లో టీమ్ఇండియా తరఫున అత్యధిక స్కోరు సచిన్ సాధించాడు. మొత్తం 23 వన్డేల్లో 21 ఇన్నింగ్స్‌లు ఆడి.. 85.4 స్ట్రైక్ రేట్‌తో 971 పరుగులు సాధించాడు. అంతేకాకుండా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో మొత్తంగా మూడో స్థానంలో నిలిచాడు. లంక మాజీ ప్లేయర్లు కుమార సంగక్కర, సనత్ జయసూర్య మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
సచిన్ తర్వాత ఇండియా తరఫున రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 22 మ్యాచుల్లో 21 ఇన్నింగ్స్ ఆడి 745 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 84.94గా ఉంది. సచిన్ రికార్డు బ్రేక్ చేయాలంటే రోహిత్‌కు ఇంకా 227 పరుగులు అవసరం. 2018లో జరిగిన టోర్నీలో రోహిత్ 5 మ్యాచుల్లోనే 300లకు పైగా పరుగులు సాధించడం విశేషం.
ఎక్కువ హాఫ్ సెంచరీలు
Highest Half Centuries In Asia Cup : ఆసియా కప్‌లో అత్యధిక అర్ధ సెంచరీల రికార్డు శ్రీలంక ప్లేయర్ కుమార సంగర్కర ఉంది. అతడు మొత్తం 8 సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు. 7 హాఫ్ సెంచరీలతో సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. మొదటి అర్ధ సెంచరీ 1997 టోర్నీలో చేయగా.. చివరి సారిగా 2012 లో చేశాడు. ఈ సారి వీళ్లద్దిరి రికార్డులను హిట్‌మ్యాన్ బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. 2018లో జరిగిన ఆసియా కప్‌లో సెంచరీతో పాటు హాఫ్ సెంచరీలూ సాధించాడు. రోహిత్ అభిమానులు ఈ రికార్డు సాధించాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇండియా తరఫున అత్యధిక మ్యాచ్‌లు
Most matches for India in Asia Cup : శ్రీలంక ఆటగాడు మహేల జయవర్ధనే ఈ టోర్నీలు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతడు మొత్తం 28 మ్యాచ్‌లు ఆడి అగ్ర స్థానంలో నిలిచాడు. ఇక 23 మ్యాచ్‌లతో ఇండియా తరఫున సచిన్ అత్యధిక మ్యాచ్‌లు ఆడాడు. సచిన్ తర్వాత.. 22 మ్యాచ్‌లతో ఆసియా కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. 2008లో జరిగిన టోర్నీలో మొదటి సారి హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్ ఆడి అరంగేట్రం చేశాడు. తర్వాత అన్ని ఎడిషన్లలో ఇండియా తరఫున మైదానంలోకి దిగాడు. ఈ సారి టోర్నమెంట్ లో కనీసం రెండు మ్యాచ్‌లు ఆడినా.. సచిన్ రికార్డు బ్రేక్ అవ్వటం ఖాయం. 2018లో జరిగిన టోర్నీలో ఇండియాకు నేతృత్వం వహించి విజేతగా నిలిపాడు. ఐదు మ్యాచ్‌లలో 93.51 స్ట్రైక్ రేట్‌తో 317 పరుగులను సాధించాడు.
ఆ మూడు సెంచరీలు..
Most Half Centuries For India In Asia Cup : ఈ టోర్నీలో సచిన్ రెండు సెంచరీలు బాది ఇండియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా సురేశ్ రైనాతో సమంగా నిలిచాడు. మొదటి సారి 1995లో శ్రీలంక పై 107 బంతుల్లో 112 పరుగులు చేయగా.. 2012 లో బంగ్లాదేశ్ పై 114 రన్స్ కొట్టి రెండో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రోహిత్ శర్మ ఇప్పటి వరకు 2018 లో పాకిస్థాన్‌పై 111 పరుగులు సాధించి మొదటి సెంచరీ కొట్టాడు. రాబోయే టోర్నీలో మరో రెండు శతకాలు సాధిస్తే.. ఈ రికార్డు బద్దలు అయ్యే అవకాశముంది.
హైయెస్ట్ యావరేజ్
Most runs for India In Asia Cup : సచిన్ 1990 నుంచి 2012 వరకు మొత్తం 6 సీజన్లలో ఆడాడు. మొత్తం 21 ఇన్నింగ్సుల్లో 51.10 యావరేజ్‌తో 971 పరుగులు కొట్టాడు. యావరేజ్ విషయంలో సచిన్ కంటే ముందు 53.04తో సనత్ జయసూర్య ఉన్నాడు. ఇక ఆసియా కప్‌లో రోహిత్ యావరేజ్ 46.56గా ఉంది. టోర్నీలో ఓవరాల్‌గా అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు. 2018 టోర్నీలో 93.51 యావరేజ్‌తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
Rohit Sharma Practice : గ్రౌండ్‌లో చెమటోడ్చిన హిట్ మ్యాన్.. ఆ టోర్నీ కోసమేనా?
Rohit Sharma Car Number Plate : రోహిత్ కార్ నంబర్‌కు అతడి సూపర్ రికార్డ్ లింక్.. అదేంటంటే?