ETV Bharat / sports

టెస్టు కెప్టెన్​గా రోహిత్​.. లంకతో టీ20 సిరీస్​కు కోహ్లీ దూరం! - రోహిత్​ శర్మ టెస్టు కెప్టెన్సీ

IND vs SL 2022: శ్రీలంకతో త్వరలో జరిగే టీ20 సిరీస్​కు విరాట్​ కోహ్లీ దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. మరోవైపు లంకతో టెస్టు సిరీస్​కు మన జట్టు కెప్టెన్​గా రోహిత్​ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు.

virat kohli
విరాట్​ కోహ్లీ
author img

By

Published : Feb 18, 2022, 9:37 PM IST

Updated : Feb 18, 2022, 11:24 PM IST

IND vs SL 2022: ప్రస్తుతం విండీస్​తో టీ20 సిరీస్​ ఆడుతున్న టీమ్​ఇండియా త్వరలో శ్రీలంక జట్టుకు ఆతిధ్యం ఇవ్వనుంది. లంకతో మూడు టీ20లు, రెండు మ్యాచుల టెస్టు సిరీస్​లు ఆడనుంది. ఇటీవల టెస్టు కెప్టెన్సీకి విరాట్​ గుడ్​బై చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే టీ20, వన్డేలకు కెప్టెన్​గా ఉన్న రోహిత్​ శర్మ సుదీర్ఘ​ ఫార్మాట్​కు కూడా సారథ్యం వహించనున్నాడు.

కోహ్లీ దూరం..

ప్రస్తుతం విండీస్​తో సిరీస్​లో ఆడుతున్న​ విరాట్​ కోహ్లీ.. శ్రీలంకతో టీ20 సిరీస్​కు దూరం కానున్నట్లు సమాచారం. మరోవైపు విరాట్​ కోహ్లీ 100వ టెస్టును బెంగళూరు స్టేడియంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈనెల 24న భారత్-శ్రీలంక టీ20 సిరీస్​ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​కు లఖ్​నవూ ఆతిథ్యమివ్వనుంది. తర్వాత రెండు మ్యాచులు ధర్మశాలలో జరగనున్నాయి. అనంతరం మార్చి 4-8 వరకు మొహలీలో తొలి టెస్టు, మార్చి 12-16 వరకు బెంగళూరులో రెండో టెస్టును బీసీసీఐ నిర్వహిస్తుంది.

ఇదీ చూడండి : టీ20 రికార్డుకు చేరువలో కోహ్లీ, రోహిత్​!

Last Updated : Feb 18, 2022, 11:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.