టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారు. న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముగిశాక వారికి చాలా రోజుల విరామం దొరికింది. దీంతో ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ భార్య రితిక.. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ బూమరాంగ్ వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె రోహిత్‌కు సారీ చెబుతూ కనిపించింది.
ఈ వీడియోలో రోహిత్ ఏదో ప్రకటన కోసం షూట్లో ఉండగా .. ఆ గదిలోనే వారి పెంపుడు కుక్క పడుకుని ఉంది. ఈ రెండింటిన పోల్చుతూ సారీ రో.. నీవు ఇక ఏ మాత్రం క్యూట్ కాదు అంటూ క్యాప్షన్ జోడించింది.
ప్రస్తుత విరామం తర్వాత ఆగస్టులో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమ్ఇండియా. 2021-23కు సంబంధించిన టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ఆగస్టు 4న నాటింగ్‌హామ్ వేదికగా జరిగే ప్రారంభ మ్యాచ్‌తో ప్రారంభించనుంది.