ETV Bharat / sports

'టీ20 వరల్డ్​కప్​ కోసం టీమ్​ఇండియా సన్నద్ధమవుతోంది'

Panth T20worldcup: మరో ఎనిమిది నెలల్లో జరగనున్న టీ20 వరల్డ్​కప్​ కోసం బలంగా తయారవ్వడానికి టీమ్​ఇండియా తమకు అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్ని పరిశీలిస్తోందని అన్నాడు బ్యాటర్​ పంత్​. వెంకటేశ్​ అయ్యర్​, హర్షల్​ పటేల్​ మంచి ఆటగాళ్లని ప్రశంసించాడు.

rishab pant
రిషబ్ పంత్
author img

By

Published : Feb 19, 2022, 1:55 PM IST

Panth T20worldcup: అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగించుకొని టీ20 ప్రపంచకప్​లో సత్తా చాటేందుకు టీమ్​ ఇండియా కృషి చేస్తోందని భారత వికెట్​ కీపర్​ రిషభ్​ పంత్ తెలిపాడు. మెగాటోర్నీలో భారత జట్టు బాగా రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్​తో జరిగిన రెండో టీ20 మ్యాచ్​​​ అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

"ప్రపంచకప్​ కోసం ఇంకా సమయం ఉంది. ఈ నేపథ్యంలో మాకు అందుబాటులో ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తున్నాం. ఆటగాళ్లు ఎవరెవరు ఏ స్థానంలో ఉండాలి, దాని వల్ల జట్టుకు ఎంత లాభం అనేది చూస్తున్నాం." అని చెప్పాడు.

వెస్టిండీస్​తో జరిగిన రెండో టీ20​లోని చివరి ఓవర్లో హర్షల్​ పటేల్​ బౌలింగ్​లో పొవెల్​ ధనాధన్​ సిక్స్​లు బాదాడు. దీని గురించి మాట్లాడుతూ.. "బుమ్రా, మహ్మద్​ షమీ గైర్హాజరిలో జట్టులోకి వచ్చిన అర్షల్​ పటేల్​ చివరి ఓవర్లలో బౌలింగ్​ వేశాడు. సిక్స్​లు బాదిన పొవెల్​కు ఆఫ్​స్టంప్​ అవతల బంతుల్ని వేయడం మా ప్రణాళిక. ఈ మ్యాచ్​లో సహజంగానే మాపై ఒత్తిడి ఉంది. కానీ మేము ఎక్కువగా ఆలోచించకుండా మా నైపుణ్యాలపై దృష్టి పెట్టాం" అని పంత్​ అన్నాడు.

హార్దిక్​ పాండ్యా స్థానంలో జట్టులోకి వెంకటేశ్​ అయ్యర్​ మంచి ఫినిషర్​ అని అన్నాడు పంత్​. అతడు పరిపక్వత చెందిన ఆటగాడని, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్​ చేయగల సమర్థుడని ప్రశంసించాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం ముఖ్యమని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: టీ20ల్లో రోహిత్​ రికార్డును సమం చేసిన కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.