ETV Bharat / sports

ప్రమాదం తర్వాత మొదటిసారి నడిచిన రిషభ్​ పంత్​.. ఫొటోలు వైరల్​! - రిషభ్​ పంత్ లేటెస్ట్​ ఫొటోస్

కారు యాక్సిడెంట్​ తర్వాత మొదటి సారి ఫొటోలను షేర్​ చేశాడు టీమ్ఇండియా క్రికెటర్​ రిషభ్​ పంత్. అందులో వాకింగ్​ స్టిక్​తో నడుస్తూ కనిపించాడు. దీంతో నెటిజన్లతో సహా సినీ, క్రికెట్ ప్రముఖులు పంత్​ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

rishabh pant images
rishabh pant images
author img

By

Published : Feb 10, 2023, 8:45 PM IST

కారు యాక్సిడెంట్​ తర్వాత మొదటి సారి నడిచాడు టీమ్ఇండియా స్టార్​ బ్యాటర్​ రిషభ్​ పంత్. ఈ మేరకు సోషల్​ మీడియాలో ఫొటోలను షేర్​ చేశాడు. ఫొటోలో పంత్‌.. చేతి కర్ర సాయంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లుగా కనిపించింది. కుడి కాలికి బ్యాండేజీ కనిపించడం.. కాలు కూడా కొంచెం వాచినట్లుగా ఉంది. దీంతో పంత్‌ కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆ ఫొటోలకు.. 'ఒక అడుగు ముందుకు, ఒక అడుగు బలంగా, ఒక అడుగు బెటర్​గా' అంటూ క్యాప్షన్​ జోడించాడు పంత్. దీంతో పాటు ఇన్​స్టాగ్రామ్​లో ఓ స్టోరీని కూడా పోస్ట్​ చేశాడు. అందులో లూడో ఆడుతున్న ఫొటోను జత చేసి 'నేను ఇంత కన్నా ఏం చేయగలను.. ఏమైనా సూచనలు ఇవ్వగలరా' అంటూ రాసుకొచ్చాడు. కాగా, పంత్​ పెట్టిన ఈ పోస్టులకు నెటిజన్లతో పాటు ప్రముఖ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

రిషభ్​ పంత్ గతేడాది గతేడాది డిసెంబర్‌ 30న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దిల్లీ నుంచి లఖ్​నవూకు వెళ్తున్న సమయంలో రూర్కీ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పలు శస్త్ర చికిత్సలు నిర్వహించిన తర్వాత.. పంత్‌ కోలుకోవడానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇక పంత్​ కెరీర్​ విషయానికొస్తే.. ఈ ప్రమాదం కారణంగా.. ఈ ఏడాది జరిగే కీలక సిరీస్‌లు, టోర్నమెంట్​లు సహా ఐపీఎల్‌ కూడా పంత్​ మిస్​ అవుతాడు. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ వరకు కోలుకున్నా.. ఫిట్‌నెస్‌ నిరూపించుకుని జట్టులో స్థానం సంపాదించడం కష్టమే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.