Rinku Singh Autograph : ఆస్ట్రేలియాతో 5వ టీ20 ముగించుకొని తిరిగి వెళ్తున్న టీమ్ఇండియా హిట్టర్ రింకూ సింగ్‌కు, బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఫ్యాన్ మూమెంట్ ఎదురైంది. సహచర టీమ్మేట్స్తో కలిసి ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్తున్న రింకూను 'సిక్సర్ కింగ్' అంటూ పిలిచాడు ఓ అభిమాని. రింకూ వెళ్తుండగా అతడిని అటోగ్రాఫ్ అడిగాడు. రింకూ వెంటనే అతడి కోట్‌పై అటోగ్రాఫ్ ఇచ్చాడు. దీంతో ఆ అభిమాని సంతోషంతో రింకూకు థాంక్స్ చెప్పాడు. ఈ వీడియోను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తమ అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
Spreading joy and putting a smile on every face - @rinkusingh235 🫶 pic.twitter.com/thJBdqoher
— KolkataKnightRiders (@KKRiders) December 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Spreading joy and putting a smile on every face - @rinkusingh235 🫶 pic.twitter.com/thJBdqoher
— KolkataKnightRiders (@KKRiders) December 4, 2023Spreading joy and putting a smile on every face - @rinkusingh235 🫶 pic.twitter.com/thJBdqoher
— KolkataKnightRiders (@KKRiders) December 4, 2023
Rinku Singh vs Aus T20 2023 : ఇక రీసెంట్గా ముగిసిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో రింకూ చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేశాడు. అతడు 4 ఇన్నింగ్స్‌ల్లో 52.50 సగటుతో 105 పరుగులు చేశాడు. అందులో 13 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ఇక తొలి రెండు మ్యాచ్‌లో అతడు వరుసగా, 22 పరుగులు (14 బంతుల్లో), 31 పరుగులు (9 బంతుల్లో) స్కోర్లు సాధించి టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Rinku singh International Debut : ఈ ఏడాది ఐర్లాండ్ పర్యటనతో రింకూ జాతీయ జట్టులోకి వచ్చాడు. ఇక డిసెంబర్లో సౌతాఫ్రికా పర్యటనలో టీ20, వన్డే మ్యాచ్‌లకూ రింకూ ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో టీమ్ఇండియా, సఫారీ గడ్డపై 3 టీ20, 3 వన్డే, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టీ20 డిసెంబర్ 10న ప్రారంభం కానుంది.
Rinku Singh 5 Sixes : రింకూ సింగ్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌పై వరుసగా 5 సిక్స్‌లు బాదిన తర్వాత రింకూ వెలుగులోకి వచ్చాడు. 2023 ఐపీఎల్లో అతడు 14 మ్యాచ్‌ల్లో 149.53 స్టైక్ రేట్‌తో 474 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కేకేఆర్ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు.
రింకూ సింగ్ సిక్సర్ల వర్షం, మెరుపు ఇన్నింగ్స్ వీడియో చూశారా?
Rinku Singh Birthday : గల్లీ నుంచి గోల్డ్ మెడల్ విన్నర్ దాకా.. రింకూ జర్నీ మీకు తెలుసా?