ETV Bharat / sports

భారత అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరంటే? - క్రికెటర్​ ఆర్యమాన్​

భారత క్రికెట్​లో అత్యంత సంపన్న క్రికెటర్​ ఎవరా? అనే ప్రశ్న వస్తే మీరేం చెప్తారు. దిగ్గజ సచిన్, ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అని అనుకుంటారు. వీరెవరు కాకుండా ఓ ఫస్ట్​క్లాస్ క్రికెటర్ వారి కంటే సంపన్నుడని ఊహించగలరా? అవును మీరు విన్నది నిజమే. ఇంతకీ అతడు ఎవరంటే?

Aryaman Birla
ఆర్యమాన్​ బిర్లా
author img

By

Published : Aug 27, 2021, 9:16 AM IST

తలచుకుంటే కోట్లలో లావాదేవీలు జరిపే స్థాయి అతడికి ఉంది. ఆస్తితో పాటు పేరు ప్రఖ్యాతలు వారసత్వంగా వచ్చినా, తండ్రి శ్రీమంతుడైనా, నచ్చిన దారిలో వెళుతూ, తనదైన ముద్ర వేయాలని అనుక్షణం తపన పడుతున్నాడు భారత ఫస్ట్​క్లాస్​ క్రికెటర్​ ఆర్యమాన్​ బిర్లా.

తండ్రి చేస్తున్న వ్యాపారంలో చేరకుండా కొన్ని భిన్నమైన ప్రణాళికలు ఏర్పరచుకున్నాడు ఆర్యమాన్​. చిన్న వయసు నుంచే క్రికెట్​పై ఇష్టం పెంచుకున్నాడు. ఆ వైపుగా అడుగులు వేశాడు.

"నా పేరు కారణంగా ఒత్తిడి ఉంటుందని అందరూ అనుకోవచ్చు. కానీ అది నాకిష్టమైన మార్గాన్ని నిర్మించుకోవటానికి ఉపయోగపడుతుంది. మైదానంలో ఆడుతున్నప్పుడు మాత్రం బంతిపైనే దృష్టి ఉండాలి. అది నా బాధ్యత. దాన్ని ముందుకు తీసుకెళ్లడానికే నేను ఇష్టపడతాను"

- ఆర్యమాన్​ బిర్లా, భారత ఫస్ట్​క్లాస్​ క్రికెటర్

ఆర్యమాన్​ కుటుంబానికి చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్​లో అతడి తండ్రి కుమార్ మంగళం బిర్లాకు రూ.70 వేల కోట్ల ఆస్తి ఉంది. బిజినెస్ ఇన్​సైడర్ ప్రకారం, 1995లో కుమార్ మంగళం బిర్లా బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి వ్యాపారం 26 రెట్లు పెరిగింది. 2015లో 41 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఇదీ చూడండి: క్రికెటర్ హార్దిక్ పాండ్య వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.