ETV Bharat / sports

ఐపీఎల్​ వేలంలో అందుకే మా ఇద్దరిని కొనలేదు: రిచర్డ్​సన్​

Richardson on ipl auction: ఐపీఎల్​ వేలంలో జంపా, తనను కొనుగోలు చేయకపోవడంపై ఆస్ట్రేలియా ఆటగాడు కేన్​ రిచర్డ్​సన్​ స్పందించాడు. తమను ఫ్రాంఛైజీలు ఎందుకు కొనుగోలు చేయలేదో కారణాన్ని వివరించాడు.

adam zampa
అడం జంపా
author img

By

Published : Feb 16, 2022, 1:17 PM IST

Updated : Feb 16, 2022, 1:39 PM IST

Richardson on ipl auction: రెండు రోజుల పాటు ఆసక్తిగా ఐపీఎల్ మెగా వేలం-2022 కొందరికి కాసుల వర్షం కురిపిస్తే.. మరికొందరిని నిరాశపరిచింది. సురేశ్​ రైనా, షకీబ్‌ అల్‌ హసన్‌, ఇయాన్‌ మోర్గాన్‌ సహా పలువురు స్టార్​ ఆటగాళ్లు అన్​సోల్డ్​గా మిగిలిపోయారు.

అయితే ఈ అన్​సోల్డ్​ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్లు జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ కూడా ఉన్నారు. తాజాగా తమను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడంపై రిచర్డ్‌సన్‌ స్పందించాడు. ఆడం జంపాను కొనకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.

గతేడాది కరోనా కారణంగా ఐపీఎల్​ మధ్యలోనే కొంతమంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. వీరిలో జంపా, కేన్​ రిచర్డ్​సన్​ కూడా ఉన్నారు. ఈ కారణంగానే తమను ఈ సారి ఏ ఫ్రాంఛైజీ తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో తాము ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోవడమే ప్రాధ్యానంగా భావించినట్లు చెప్పుకొచ్చాడు. గతంలో వీరిద్దరు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించారు.

కాగా, ఈ మెగా వేలంలో తాను ఏ ఫ్రాంఛైజీతోనూ సంప్రదింపులు జరుపలేదని రిచర్డ్‌సన్‌ అన్నాడు. వ్యక్తిగత కారణాల వల్లే గత రెండు సీజన్లలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంలేకపోయినట్లు తెలిపాడు.

ఇదీ చదవండి: IND VS WI: ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు కలిసిన వేళ!

Last Updated : Feb 16, 2022, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.