ETV Bharat / sports

భారీగా పెరగనున్న దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్​ ఫీజులు! - ఫస్ట్ క్లాస్​ క్రికెటర్ల జీతాలపై బీసీసీఐ

దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్​ ఫీజులు పెంచుతూ బీసీసీఐ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఆటగాళ్లకు చెల్లించే ఫీజుల్లో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో పాటు కార్యదర్శి జై షా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

domestic cricketers, bcci
దేశవాళీ క్రికెటర్లు, బీసీసీఐ
author img

By

Published : Jul 3, 2021, 2:28 PM IST

ఫస్ట్​ క్లాస్​ క్రికెటర్లకు భారత క్రికెట్​ నియంత్రణ మండలి త్వరలోనే శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. వారికి చెల్లించే మ్యాచ్​ ఫీజులను భారీగా పెంచనున్నట్లు సమాచారం.

కొవిడ్ నేపథ్యంలో గతేడాది కాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు దేశవాళీ క్రికెటర్లు. దీంతో వారికి చెల్లించే మ్యాచ్​ ఫీజులపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో పాటు కార్యదర్శి జై షా, ఉప కార్యదర్శి రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్​.. ఓ నిర్ణయానికి వచ్చారు.

భారీ పెరుగుదల..

ఫస్ట్ క్లాస్​ క్రికెటర్ల చెల్లింపుల్లో భారీ మార్పులు జరగనున్నట్లు సమాచారం. దాని ప్రకారం.. 20 కంటే ఎక్కువ ఫస్ట్​ క్లాస్​ మ్యాచ్​లు ఆడిన ఆటగాళ్లకు మ్యాచ్​ ఫీజును రూ.60వేలకు పెంచనున్నారు. కొంత అనుభవం తక్కువ ఉన్న ఆటగాళ్లకు రూ.45వేలు చెల్లించనున్నారు. ఇక రంజీల్లో ఆడే వారికి రోజుకు రూ.35వేలు ఇవ్వనున్నారు. మ్యాచ్​ మొత్తానికి ఒక్కో ఆటగాడికి రూ.1.40 లక్షలు ముట్టనున్నాయి. మరో వెయ్యి రూపాయలు రోజు వారీ భత్యం కింద ఇస్తారు.

కొవిడ్ సంక్షోభం కారణంగా గత దేశవాళీ సీజన్​ నుంచి ఆటగాళ్లకు చెల్లింపులు చేయలేదు బీసీసీఐ. దీంతో ఆటగాళ్లకు ఇవ్వనున్న మొత్తంలో తాజా మార్పులు వారికి ఊరటనివ్వనున్నాయి. ఇక విజయ్​ హజారే ట్రోఫీలో ఆడే క్రికెటర్లకు ఒక్క మ్యాచ్​కు రూ.35వేలు, ముస్తాక్​ అలీ ప్లేయర్లకు రూ.17,500 ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి: 'టీ20 ప్రపంచకప్​ కంటే యాషెస్​ ముఖ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.