కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో క్రీడా పోటీలన్నీ దాదాపు నిలిచిపోయాయి. ఈ సమయంలో పాకిస్థాన్ సూపర్ లీగ్.. తిరిగి నిర్వహించేందుకు పాక్ బోర్డు సిద్ధమైంది. జూన్‌లో యూఏఈ వేదికగా ఈ మ్యాచుల్ని జరపనున్నారు.
మార్చిలో పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆరో సీజన్ జరిగింది. కరోనా కేసులు రావడం వల్ల లీగ్‌ను అర్ధంతరంగా నిలిపేశారు. అయితే మిగిలిన 20 మ్యాచ్‌ల్ని యూఏఈలో జరపాలని భావించారు. అందుకు ఆరు ఫ్రాంచైజీలు సమ్మతించాయి. దీంతో జూన్ 1-20 మధ్య ఈ మ్యాచ్‌ల్ని జరపనున్నట్లు పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్ వెల్లడించారు.
అయితే ఇదే వైరస్ కారణంగా ఐపీఎల్ కూడా నిరవధిక వాయిదా పడింది. మిగిలిన మ్యాచ్‌ల్ని సెప్టెంబరు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పీఎస్ఎల్ మిగిలిన మ్యాచ్‌ల్ని పాక్ బోర్డు విజయవంతంగా నిర్వహిస్తే, బీసీసీఐ ఆలోచన మారి, ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌ల్ని ముందే జరపొచ్చేమో!