ETV Bharat / sports

యూఏఈ టీ20 లీగ్​లో ఫ్రాంఛైజీపై కన్నేసిన రిలయన్స్

ఐపీఎల్​లో అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టు ముంబయి ఇండియన్స్​. ఈ జట్టుకు యాజమానిగా ఉన్న రిలయన్స్​ తమ క్రికెట్ సామాజ్రాన్ని విస్తరించే పనిలో పడింది. తాజాగా యూఏఈ టీ20లీగ్​లో(UAE t20 league) ఓ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

neeta ambani
నీతా అంబానీ
author img

By

Published : Nov 25, 2021, 10:29 AM IST

UAE T20 League: ఐపీఎల్​లో ఇప్పటికే ఓ జట్టుకు యజమానిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్​(reliance industries limited news) తమ క్రికెట్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో పడింది. రిలయన్స్​ గ్రూప్స్​లో ఒకటైన రిలయన్స్ స్ట్రాటెజిక్ బిజినెస్ వెంచర్స్​ లిమిటెడ్ ద్వారా మరో కొత్త ఫ్రాంఛైజీని సొంతం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.

యూఏఈ టీ20 లీగ్..

ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సారథ్యంలో జరగనున్న యూఏఈ టీ20 లీగ్​లో ఓ ఫ్రాంఛైజీని సొంతం చేసుకోనున్నట్లు రిలయన్స్​ ప్రకటించింది. యూఏఈ టీ20 లీగ్ ఛైర్మన్, ఈసీబీ(emirates cricket board news) వైస్​ ఛైర్మన్ ఖాలిద్ అల్ జరూనీ దీనిపై స్పష్టత ఇచ్చారు. తమ లీగ్​లో రిలయన్స్​ పెట్టుబడులు పెట్టనుందని పేర్కొన్నారు. ఆర్​ఐఎల్​ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

"యూఏఈ టీ20 లీగ్​ ద్వారా దుబాయ్​లో క్రికెట్​ను మరింత విస్తరించాలని చూస్తున్నాం. లీగ్​లోని పలు ఫ్రాంఛైజీలు క్రికెట్​ను అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా తరచూ నిర్వహించేలా ప్రణాళిక చేస్తున్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్​ లిమిటెడ్ సంస్థ ప్రస్తుతం ఈ లీగ్​లో పెట్టుబడులకు ఆసక్తి చూపడం సంతోషకరమైన విషయం." అని జరూనీ అన్నారు.

అభిమానులకు ధన్యవాదాలు..

ముకేశ్ అంబానీ భార్య, ముంబయి ఇండియన్స్ సహ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ కూడా ఈ విషయంపై మాట్లాడారు. విదేశీ ఫ్రాంఛైజీ కొనేందుకు వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబయి జట్టుకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. విదేశీ ఫ్రాంఛైజీ కొనుగోలును ఓ మంచి అవకాశంగా అభివర్ణించారు.

ఐపీఎల్ తరహాలో పాకిస్థాన్​, వెస్టిండీస్​లో ఇప్పటికే ప్రీమియర్​ లీగ్​లు ప్రారంభమవగా యూఏఈ త్వరలోనే ఈ జాబితాలో చేరనుంది. ​ఈమేరకు ఎమిరేట్స్​ బోర్డును ఏర్పాటు చేసి క్రికెట్​ను విస్తరించే పనిలో పడింది.

ఇదీ చదవండి:

IPL 2022: ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. ఐపీఎల్-15 అప్పటినుంచే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.