Red Card In Cricket : ఫుట్‌బాల్, హాకీ లాంటి ఆటల్లో రెడ్, యెల్లో కార్డ్ అనే పదాలు వినిపిస్తాయి. సాధారణంగా ప్లేయర్లు గ్రౌండ్లో అతిగా ప్రవర్తించినప్పుడు సదరు ఆటగాడికి అంపైర్లు ఈ కార్డులను జారీ చేస్తారు. యెల్లో కార్డ్ జారీ చేస్తే.. ఆటగాడు తాత్కాలికంగా 5 నిమిషాల పాటు మైదానాన్ని వీడాలి. అదే రెడ్ కార్డు ఇష్యూ అయితే.. ప్లేయర్‌పై పూర్తిగా ఆట నుంచి నిషేధం విధిస్తారు. కానీ ఈ నిబంధన ప్రస్తుతానికి అంతర్జాతీయ క్రికెట్లో లేదు. అయితే వెస్టిండీస్‌లో జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం ఈ రూల్‌ను ప్రవేశపెట్టారు. ఈ నిబంధన ప్రకారం నిషేధానికి గురైన తొలి క్రికెటర్ ఎవరంటే..
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం నెవిస్ పాట్రియాట్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ లీగ్‌లో విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్.. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో నరైన్.. రెడ్‌కార్డ్ నిబంధన వల్ల గ్రౌండ్‌ను వీడాడు. సీపీఎల్ నిబంధనల ప్రకారం ఏ జట్టైనా.. నిర్ణిత సమయంలోపు 18 ఓవర్‌ను ప్రారంభించకపోతే.. ఆ ఓవర్లో 30 యార్డ్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి.
19 ఓవర్ సమయానికి ఓవర్ రేట్ తక్కువగా ఉంటే.. సర్కిల్ వెలుపల 3 ఫీల్డర్లు ఉండాలి. ఇక 20 ఓవర్ ప్రారంభానికి కూడా తక్కువ ఓవర్ రేట్‌ను కంటిన్యూ చేస్తే.. బౌలింగ్ జట్టు నుంచి ఎవరైన ఒక ఫీల్డర్ గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాల్సిందే. అది ఎవరనేది ఆ జట్టు కెప్టెన్ నిర్ణయిస్తాడు. అలా ఆదివారం నాటి మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్.. తమ జట్టు ప్లేయర్ నరైన్‌ను మైదానం వీడాల్సిందిగా కోరాడు. అలా నరైన్ ఈ రెడ్‌కార్డుకు బలైన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
Caribbean Premier League 2023 : ఇక మ్యాచ్ విషయాని కోస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నెవిస్ పాట్రియాట్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లకు 178 పరుగులు చేసింది. అనంతరం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్.. నికోలస్ పూరన్ (61) హాఫ్ సెంచరీకి , కెప్టెన్ పొలార్డ్ (37 పరుగులు 5x6) తుపాన్ ఇన్నింగ్స్ తోడవడం వల్ల.. నాలుగు వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది.
-
Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1
— CPL T20 (@CPL) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1
— CPL T20 (@CPL) August 28, 2023Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1
— CPL T20 (@CPL) August 28, 2023
-
TKR are on the board!!! They secure win #️⃣1️⃣ of CPL 23 by 6 wickets 🙌.#CPL23 #SKNPVTKR #CricketPlayedLouder #BiggestPartylnSport pic.twitter.com/9jpNw4ay2h
— CPL T20 (@CPL) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">TKR are on the board!!! They secure win #️⃣1️⃣ of CPL 23 by 6 wickets 🙌.#CPL23 #SKNPVTKR #CricketPlayedLouder #BiggestPartylnSport pic.twitter.com/9jpNw4ay2h
— CPL T20 (@CPL) August 28, 2023TKR are on the board!!! They secure win #️⃣1️⃣ of CPL 23 by 6 wickets 🙌.#CPL23 #SKNPVTKR #CricketPlayedLouder #BiggestPartylnSport pic.twitter.com/9jpNw4ay2h
— CPL T20 (@CPL) August 28, 2023
-
SENT OFF! The 1st ever red card in CPL history. Sunil Narine gets his marching orders 🚨 #CPL23 #SKNPvTKR #RedCard #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/YU1NqdOgEX
— CPL T20 (@CPL) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">SENT OFF! The 1st ever red card in CPL history. Sunil Narine gets his marching orders 🚨 #CPL23 #SKNPvTKR #RedCard #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/YU1NqdOgEX
— CPL T20 (@CPL) August 28, 2023SENT OFF! The 1st ever red card in CPL history. Sunil Narine gets his marching orders 🚨 #CPL23 #SKNPvTKR #RedCard #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/YU1NqdOgEX
— CPL T20 (@CPL) August 28, 2023