ETV Bharat / sports

'ఆ సెమీస్​లో ఓడినందుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి'

2011 ప్రపంచకప్​ అనంతరం తనకు ప్రత్యేకంగా ఎదురైన పరిణామాల గురించి వెల్లడించాడు దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్. సెమీస్​లో ఓటమి అనంతరం తనతో పాటు తన భార్యకు బెదిరింపు ఫోన్లు వచ్చాయని తెలిపాడు.

author img

By

Published : May 19, 2021, 5:30 AM IST

du plesis, south africa cricketer
డుప్లెసిస్, దక్షిణాఫ్రికా క్రికెటర్

భారత్ వేదికగా 2011లో జరిగిన ప్రపంచకప్​ అనంతరం జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్. ఆ టోర్నీ సెమీఫైనల్లో న్యూజిలాండ్​ చేతిలో ఓడింది ప్రోటీస్​ జట్టు.

''వరల్డ్​కప్​ నుంచి నిష్క్రమించిన తర్వాత నాతో పాటు నా భార్యకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మమ్మల్ని అంతమొందిస్తామంటూ చాలా మంది ఫోన్లు చేశారు. సామాజిక మాధ్యమాల్లో మాకు ఇబ్బందులు ఎదురయ్యాయి.'' అని డుప్లెసిస్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

ఢాకాలోని షేర్​ ఏ బంగ్లా స్టేడియంలో కివీస్​తో జరిగిన మ్యాచ్​లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. వెటోరి నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ప్రోటీస్ పూర్తిగా తడబాటుకు గురైంది. 172 పరుగులకే ఆలౌటైంది.

ఇదీ చదవండి: 'వీడ్కోలు విషయంలో ఏబీ గత నిర్ణయమే ఫైనల్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.