ETV Bharat / sports

పంత్​, శ్రేయస్​ను కాదని.. వైస్​ కెప్టెన్సీ బుమ్రాకే ఎందుకు?

Jasprit Bumrah: దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే జట్టుకు వైస్ కెప్టెన్​గా ఎంపికయ్యాడు టీమ్​ఇండియా స్టార్ బౌలర్ జస్​ప్రీత్ బుమ్రా. అయితే ఐపీఎల్​లో ఇదివరకే విజయవంతమైన సారథులుగా రాణిస్తున్న రిషభ్​ పంత్, శ్రేయస్​ అయ్యర్​ను కాదని బుమ్రాకు ఆ బాధ్యతలను అప్పగించడంపై పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై బీసీసీఐ వర్గాలు వివరణ ఇచ్చాయి.

Jasprit Bumrah
బుమ్రా
author img

By

Published : Jan 1, 2022, 10:25 PM IST

Jasprit Bumrah: భారత క్రికెట్లో బౌలర్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం చాలా అరుదు. కానీ, త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌ కోసం సీనియర్‌ బౌలర్ బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసి బీసీసీఐ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే, ఇప్పటికే ఐపీఎల్‌లో కెప్టెన్లుగా నిరూపించుకున్న శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండగా.. బుమ్రాకే ఎందుకు ఆ బాధ్యతలు అప్పగించారనే విషయంపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది.

"ఇటీవల ఆసీస్‌ సీనియర్‌ బౌలర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అలాగే, మేం బుమ్రాకు బాధ్యతలు అప్పగించాం. అతడు 2016 నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎలివేట్‌ చేస్తే.. శ్రేయస్ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ లాంటి యువ ఆటగాళ్లు నిలకడగా రాణించేందుకు ప్రయత్నిస్తారని సెలెక్టర్లు భావించి ఉండొచ్చు. ఎలాగూ వెస్టిండీస్, శ్రీలంక జట్లతో స్వదేశంలో జరుగనున్న సిరీసులకు వన్డే కెప్టెన్ రోహిత్‌ శర్మ అందుబాటులోకి వస్తాడు. కాబట్టి ఈ ఒక్క సిరీస్‌కే బుమ్రా వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతాడు" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

'మరికొంత కాలం నిలకడగా రాణించాలి'

"ఒక ఫాస్ట్ బౌలర్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించడం చాలా మంచి నిర్ణయం. బుమ్రా నిలకడగా రాణిస్తూ అన్ని ఫార్మాట్లలో ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. అయితే, ఒక్క సిరీస్‌లో బాధ్యతలు అప్పగించి.. అతడి నాయకత్వ పటిమపై ఓ నిర్ణయానికి రాలేం. ఒక వేళ రోహిత్, కేఎల్‌ రాహుల్ ఇద్దరూ అందుబాటులో లేకపోతే.. పరిస్థితి మరోలా ఉండేది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్.. మరింత కాలం స్థిరంగా రాణించాల్సిన అవసరం ఉంది" అని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు. ఐపీఎల్-2020 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించి ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత 2021 సీజన్‌లో దిల్లీ పగ్గాలు చేపట్టిన రిషభ్‌ పంత్‌ కూడా మెరుగ్గానే రాణించాడు.

ఇదీ చూడండి: IND VS SA: 'రుతురాజ్​ ఓ సంచలనం.. కానీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.