ETV Bharat / sports

ధోనీ ఫోన్​ నెంబరు ఇప్పటికీ నా దగ్గర లేదు: రవిశాస్త్రి

Ravishastri Dhoni: టీమ్​ఇండియా మాజీ సారథి మహీ లాంటి వ్యక్తిని తానెప్పుడూ చూడలేదని అన్నాడు మాజీ కోచ్​ రవిశాస్త్రి. ధోనీ ఫోన్​ ఎక్కువ ఉపయోగించడని, అతడి నెంబరు కూడా ఇప్పటికీ తన దగ్గర లేదని చెప్పాడు.

dhoni
ధోనీ
author img

By

Published : Jan 27, 2022, 1:59 PM IST

Ravishastri Dhoni: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని అన్నాడు. ధోనీ ఎంతో ప్రశాంతంగా ఉంటాడని, ఎప్పుడూ కోపంగా ఉన్నట్లు చూడలేదని చెప్పాడు. పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడిన శాస్త్రి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు.

‘మహీ డకౌటైనా.. శతకం సాధించినా.. ప్రపంచకప్‌ గెలిచినా.. తొలి రౌండ్‌లోనే జట్టు వెనుదిరిగినా ఒకేలా ఉంటాడు. నేనెంతో మందిని చూశాను. కానీ, ధోనీ లాంటి ఆటగాడిని చూడలేదు. ఒక్కోసారి సచిన్‌కు కూడా టెంపర్మెంట్‌ ఉంటుంది. అప్పుడప్పుడు కోపం వస్తుంది. కానీ, ధోనీకి మాత్రం ఎప్పుడూ రాదు’ అని శాస్త్రి వివరించాడు.

"మహీ ఫోన్‌ వాడొద్దనుకుంటే అలాగే ఉండగలడు. తాను గ్యాడ్జెట్‌ పక్కన పెట్టాలనుకుంటే అలాగే పెట్టేస్తాడు. ఇప్పటికీ నా వద్ద అతడి ఫోన్‌ నంబర్‌ లేదంటేనే అర్థం చేసుకోవచ్చు. నేనెప్పుడూ తన నంబర్‌ కూడా అడగలేదు. తను అసలు ఫోన్‌ దగ్గర పెట్టుకోడని నాకు తెలుసు. అతడిని సంప్రదించాలనుకుంటే ఎలా కనెక్ట్‌ అవ్వొచ్చో నాకు తెలుసు. ధోనీ చాలా ప్రత్యేకమైన ఆటగాడు" అని మాజీ కోచ్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

అలాగే విరాట్‌పై స్పందించిన అతడు.. కోహ్లీ మైదానంలో దిగితే గెలుపే లక్ష్యంగా ఆడతాడని, అక్కడ దేనీ గురించీ పట్టించుకోడని అన్నాడు. ఇక మైదానం బయట మాత్రం పూర్తి భిన్నంగా.. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని తెలిపాడు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో అతడు కొద్ది నెలలు విరామం తీసుకొని తిరిగి జట్టుకు ఆడితే మంచి ఫలితాలు ఉంటాయన్నాడు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

'ధోనీలాంటోడు ఉండాల్సిందే.. ఆ సత్తా ఇద్దరికే ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.