ETV Bharat / sports

రవిశాస్త్రి మెరుపుల వల్లే టీమ్​ఇండియాకు ఆ టైటిల్​

గురువారం, టీమ్​ఇండియా కోచ్​ రవిశాస్త్రి 59వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అతడి రికార్డులను గుర్తుచేసుకుంటున్నారు. ఓ సారి ఆ రికార్డులపై లుక్కేద్దాం..

Ravisastri
రవిశాస్త్రి
author img

By

Published : May 27, 2021, 2:47 PM IST

టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి, గురువారంతో 59వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానులు అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ట్విటర్​లో #RaviShastri ట్యాగ్‌ను ట్రెండింగ్‌ చేస్తున్నారు. అతడి రికార్డులను గుర్తు చేసుకుంటున్నారు. 1985 బెన్సన్‌ అండ్‌ హెడ్జెస్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శాస్త్రి ప్రదర్శన గురించి మాట్లాడుకుంటున్నారు.

రవిశాస్త్రి కెరీర్‌లో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడి 6,938 పరుగులు చేశాడు. 280 వికెట్లు తీశాడు. 1985 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అతడి ప్రదర్శనలు అద్భుతం. మొత్తంగా 182 పరుగులు చేసి 8 వికెట్లు తీశాడు. అతడి మెరుపుల వల్లే టీమ్‌ఇండియాకు విజ్డెన్‌ టీమ్‌ ఆఫ్ ది సెంచరీ టైటిల్‌ దక్కింది.

ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో పాక్‌ మొదట 179/9కి పరిమితమైంది. బంతితో వికెట్‌ తీసిన శాస్త్రి ఛేదనలోనూ 63 పరుగులు చేశాడు. ప్రశాంతంగా ఆడుతూ 8 వికెట్ల తేడాతో జట్టుకు విజయం అందించాడు. 1983 ప్రపంచకప్‌ జట్టులోనూ శాస్త్రి సభ్యుడు. భారత్‌ క్రికెట్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన మొదటి ఆటగాడు ఇతడే.

  • 1⃣9⃣8⃣3⃣ World Cup-winner 🏆
    2⃣3⃣0⃣ intl. games 👌
    6⃣9⃣3⃣8⃣ intl. runs & 2⃣8⃣0⃣ intl. wickets 👍

    Here's wishing @RaviShastriOfc - former India captain & present #TeamIndia Head Coach - a very happy birthday. 🎂 👏 pic.twitter.com/fn82nU9Isz

    — BCCI (@BCCI) May 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కోచ్‌గానూ టీమ్‌ఇండియాకు రవిశాస్త్రి అద్భుత విజయాలు అందించాడు. అతడి కోచింగ్‌లో భారత్‌.. ఆస్ట్రేలియాలో రెండుసార్లు సిరీస్‌ విజయాలు సాధించింది. విదేశాల్లోనూ రాణించింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరింది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో రన్నరప్‌గా నిలచింది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. త్వరలో కివీస్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడనుంది.

  • Happy Birthday, Ravi Bhai. May you keep uplifting our spirits both on and off the field. Wish you the best of years ahead. pic.twitter.com/9IfUUuWL3s

    — Ajinkya Rahane (@ajinkyarahane88) May 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రవిభాయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మైదానం లోపల, బయట మాకు ఇలాగే ఉత్సాహాన్ని అందించాలి. మీ భవిష్యత్తు బాగుండాలి

- అజింక్య రహానె

జన్మదిన శుభాకాంక్షలు రవిభాయ్‌!! మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నా. సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా

- ఇషాంత్ శర్మ

ట్రేసర్‌ బుల్లెట్‌ రవిశాస్త్రికి జన్మదిన శుభాకాంక్షలు

- దినేశ్‌ కార్తీక్‌

ఇదీ చూడండి 'అప్పుడు రవిశాస్తి ఎంత రెడ్ వైన్ తాగాడో!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.