ETV Bharat / sports

'జడేజా అసలైన 3డీ ప్లేయర్.. ఎందుకంటే?' - రవీంద్ర జడేజా డానిష్ కనేరియా

ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ఇండియాకు ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అత్యంత కీలకం కానున్నాడని తెలిపాడు పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా(Danish Kaneria). అతడు అసలైన 3డీ ప్లేయర్ అని కొనియాడాడు.

Ravindra jadeja
జడేజా
author img

By

Published : Jun 7, 2021, 11:50 AM IST

భారత జట్టులో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అత్యంత విలువైన ఆటగాడని పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్‌ కనేరియా (Danish Kaneria) అన్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో అతడు అత్యంత కీలకం అవుతాడని చెప్పాడు. కీలక సమయాల్లో వికెట్లు తీయగల, పరుగులు చేయగల సామర్థ్యం అతడికి ఉందని ప్రశంసించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌(WTC Final)కు ముందు కనేరియా తన యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడాడు.

"ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బౌలర్లు కీలకపాత్ర పోషిస్తారు. వాళ్లు వికెట్లు తీస్తేనే మనం మ్యాచ్‌లు గెలవగలం. ఇక రవీంద్ర జడేజా గురించి చెప్పాలంటే అతడో 3డీ ఆటగాడు. అలాంటి క్రికెటర్‌ను పక్కన పెట్టేయడం సులభం కాదు. అతడు కచ్చితంగా ఆడాల్సిందే. జడ్డూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తాడు. లోయర్‌ ఆర్డర్‌లో పరుగులు చేస్తాడు. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతాడు. ఇక మెరుపు ఫీల్డింగ్‌తో ఒకట్రెండు రనౌట్లు చేయగలడు. అందుకే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌లో అతడే అత్యంత విలువైన ఆటగాడు."

-డానిష్ కనేరియా, పాక్ మాజీ ఆటగాడు

హార్దిక్‌ పాండ్యా, కుల్‌దీప్‌, యుజ్వేంద్ర చాహల్‌ రావడం వల్ల రవీంద్ర జడేజాకు జట్టులో చోటు లేకుండా పోయింది. రెండేళ్లు అతడు పరిమిత ఓవర్ల క్రికెట్లో సరైన అవకాశాలు లభించక బాధపడ్డాడు. టెస్టు జట్టులో ఉన్నప్పటికీ రిజర్వు బెంచీపైనే ఉండేవాడు. ఎప్పుడైతే వెన్నెముక గాయంతో పాండ్యా దూరమయ్యాడో జడ్డూ కీలకంగా మారాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 10 మ్యాచుల్లో 469 పరుగులు చేశాడు. బంతితో 28 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం కివీస్‌తో ఛాంపియన్​షిప్ ఫైనల్‌కు సిద్ధమవుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.