Ravindra Jadeja: టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది. వెస్టిండీస్‌తో నేడు జరగబోయే తొలి వన్డేకు జడేజా ఆడే అవకాశాలు తక్కువగా కన్పిస్తున్నాయి. గాయంతో ఇబ్బంది పడుతున్న అతడు తొలి మ్యాచ్‌లో ఆడతాడో లేదో అని కెప్టెన్ శిఖర్ ధావన్ చెప్పడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
"ప్రస్తుతం జడేజా కొంత ఇబ్బందిగా ఉన్నాడు. అందువల్ల తొలి మ్యాచ్‌కు అతడు ఫిట్‌గా ఉన్నాడో లేదో మాకు పూర్తిగా తెలియదు" అని అన్నాడు. అయితే జడేజాకు ఎలాంటి గాయమైందన్న వివరాలను మాత్రం అతడు వెల్లడించలేదు. యువ బౌలర్లు సంసిద్ధంగానే ఉన్నారని ధావన్ తెలిపాడు. "ఫాస్ట్ బౌలింగ్‌లో సిరాజ్, ప్రసిధ్‌తో పాటు స్పిన్నర్లు అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్‌లతో మా బౌలింగ్ యూనిట్ పటిష్ఠంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు.
ఈ రాత్రి 7 గంటల నుంచి వెస్టిండీస్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో వన్డే మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ రోహిత్, కోహ్లి, హార్దిక్, పంత్, షమి, బుమ్రా ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నారు. ఈ మైదానంలో టీమిండియా ఆడిన చివరి 9 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట విజయం సాధించింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో నేటి మ్యాచ్‌లో భారత్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువే అయినా.. అగ్రశ్రేణి ఆటగాళ్ల గైర్హాజరీతో ధావన్ నాయకత్వంలో భారత కుర్రాళ్లు ఎలా ఆడతారో చూడాలి..!
ఇదీ చూడండి: చేతులెత్తేసిన శ్రీలంక.. ఆసియా కప్ వేదిక ఎక్కడంటే..